ధౌని నుంచి ధోనీగా.. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్‌తో గ్లోబల్ బ్రాండ్‌గా మారిన మహేంద్రుడి స్టోరీ ఇదే?

ధౌని నుంచి ధోనీగా.. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్‌తో గ్లోబల్ బ్రాండ్‌గా మారిన మహేంద్రుడి స్టోరీ ఇదే?

MS Dhoni Original Name: భారత మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్ లో కెప్టెన్ కూల్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ పేరు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ కు ధోనీగా తెలిసిన ఈ క్రికెటర్ అసలు పేరు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా అతని జీవితంలో అసలు పేరును పూర్తిగా మార్చేసింది. 1981 జూలై 7వ తేదీన అప్పటి బీహార్‌లోని (ప్రస్తుత జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ కుటుంబ మూలాలు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా ల్వాలీ గ్రామానికి చెందినవి.

స్పెల్లింగ్ మిస్టేక్తో క్రికెట్లో హీరో:

ఇక ధోనీ తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకీ దేవి. అయితే వీళ్ల కుటుంబ అసలు ఇంటి పేరు ధౌని (Dhauni). రాంచీలోని DAV జవహర్ విద్యా మందిర్‌లో చదువుతున్న సమయంలో రికార్డుల్లో Dhauniకి బదులుగా 'Dhoniగా నమోదైంది. కుటుంబ సభ్యులు ఆ తప్పును సరిచేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది అధికారికంగా చేంజ్ కాలేదు.. చివరకు అదే స్పెల్లింగ్ మిస్టేక్ క్రికెట్ ప్రపంచంలో స్థిరపడేలా చేసింది. 

ఫుట్‌బాల్ గోల్‌కీపర్ నుంచి వికెట్ కీపర్‌గా:

చిన్నప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ ఫుట్‌బాల్ టీమ్‌లో గోల్‌కీపర్‌గా ఆడుతున్న ధోనీ ప్రతిభను గమనించిన కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ప్రయత్నించాలని సూచించారు. ఆ ఒక్క నిర్ణయం అతడి జీవితాన్ని, భారత క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చింది. 

టికెట్ కలెక్టర్ నుంచి వరల్డ్ కప్ విన్నర్‌గా:

కమాండో క్రికెట్ క్లబ్, CCL జట్ల తరఫున ఆడినప్పటికీ వెంటనే భారత జట్టులో చోటు మాత్రం ధోనీకి దక్కలేదు. దీంతో జీవనోపాధి కోసం ధోనీ 2001 నుంచి 2003 వరకు ఖరగ్‌పూర్‌లో రైల్వే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)గా ఉద్యోగం చేశారు. ఇక 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌కు అందించి ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచారు. ఒక చిన్న స్కూల్ స్పెల్లింగ్ పొరపాటుతో ధౌని నుంచి ధోనీగా మారిన పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచింది.