ఐఫోన్ యూజర్లకు ఎయిర్టెల్ ఆఫర్.. ఉచితంగా క్లౌడ్ స్టోరేజీ 

ఐఫోన్ యూజర్లకు ఎయిర్టెల్ ఆఫర్.. ఉచితంగా క్లౌడ్ స్టోరేజీ 

హైదరాబాద్, వెలుగు: టెలికం ఆపరేటర్​ఎయిర్‌‌‌‌టెల్ రూ.999 లేదా అంతకంటే విలువైన పోస్ట్‌‌‌‌పెయిడ్ ప్లాన్లు వాడే ఐఫోన్ వినియోగదారులకు 50 జీబీ ఐక్లౌడ్ ప్లాన్‌‌‌‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే తమ పోస్ట్‌‌‌‌పెయిడ్ చందాదారులందరికీ గూగుల్ వన్ ద్వారా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌‌‌‌టెల్ తాజా పోస్ట్‌‌‌‌పెయిడ్ ఆఫరింగ్‌‌‌‌లో ఆపిల్ ఐక్లౌడ్ ప్లస్ సేవలతో పాటు క్లౌడ్​స్టోరేజ్, వ్యక్తిగత కంటెంట్ షేరింగ్ సదుపాయాలు లభిస్తాయి.  

ఆపిల్ టీవీ ఒరిజినల్స్, ఆపిల్ ఆర్కేడ్ ద్వారా వందలాది గేమ్‌‌‌‌లను ఆస్వాదించవచ్చు.  ఐక్లౌడ్ ప్లస్ సహాయంతో లక్షలాది మంది పోస్ట్‌‌‌‌పెయిడ్ వినియోగదారులు తమ ఫోటోలు, ఫైళ్లు, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు, కాంటాక్ట్‌‌‌‌లను అన్ని ఆపిల్ డివైజ్‌‌‌‌లలో సులభంగా సింక్ చేసుకోవచ్చని ఎయిర్​టెల్​ తెలిపింది.