న్యూఢిల్లీ: మరిన్ని మారుమూల ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ఉడాన్ పథకం కింద వివిధ రాష్ట్రాలతో, యూటీలతో 21 ఒప్పందాలు కుదుర్చుకున్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇప్పటికే ఉడాన్ కింద 687 రూట్లు, 95 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.
కొత్త దశ ద్వారా వచ్చే పదేళ్లలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేర్కొన్నారు. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం ఈ పథకం లక్ష్యం.
