కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో బుధవారం జరుగనున్న గణేశ్ నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు, ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు వెలిచాల క్రాస్ రోడ్ నుంచి చింతకుంట మీదుగా మళ్లించి కరీంనగర్‌లోకి.. హుజురాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు మానకొండూర్ హైవే మీదుగా దుర్షేడ్ వైపు మళ్లించి పట్టణంలోకి రావాలని తెలిపారు.
నగరంలో గాంధీ చౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, కమాన్, కేబుల్ బ్రిడ్జి, సదాశివపల్లి జంక్షన్ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
23-,24 తేదీల్లో హుజురాబాద్, జగిత్యాల, సిరిసిల్ల వైపుల నుంచి కరీంనగర్ వైపు గ్రానైట్ లారీలు, ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలు, క్వారీ యజమానులు ఈ ఆంక్షలను గమనించి పోలీసులకు సహకరించాలని సీపీ సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని
కోరారు.
