మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికవరీ చేస్తున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు.
తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్స్‌ను గుర్తించి రికవరీ చేశామని, మంగళవారం బాధితులకు అందించినట్లు తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నా,చోరీకి గురైనా వెంటనే సమీప పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్సై జి.వి.కృష్ణారెడ్డి, పీసీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
