క్రికెట్‌‌‌‌కు ఇంగ్లండ్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ మార్క్‌‌ వుడ్‌ గుడ్‌‌బై

క్రికెట్‌‌‌‌కు ఇంగ్లండ్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ మార్క్‌‌ వుడ్‌ గుడ్‌‌బై

లండన్‌‌: ఇంగ్లండ్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ మార్క్‌‌ వుడ్‌ ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పాడు. గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బందిపడుతున్న వుడ్‌‌.. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. గాయాల వల్ల టెస్ట్, వన్డేలు ఆడటం సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టం చేసినట్లు వుడ్‌‌ వెల్లడించాడు. తన 11 ఏళ్ల కెరీర్‌‌లో వుడ్‌‌ 2019 వన్డే వరల్డ్‌‌ కప్‌‌, 2022 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ గెలిచిన ఇంగ్లండ్‌‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు యాషెస్‌‌ సిరీస్‌‌లు ఆడిన వుడ్‌‌ 2015లో ట్రెంట్ బిడ్జ్‌‌ వేదికగా జరిగిన యాషెస్‌‌ను కైవసం చేసుకున్న ఆఖరి వికెట్‌‌ను తీశాడు. మొత్తం 38 టెస్టుల్లో 119 వికెట్లు, 70 వన్డేల్లో 80 వికెట్లు, 38 టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు.