ఇడ్లీ, ఉప్మా, ఓట్స్... షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు ఏది బెస్ట్ అంటే...?

ఇడ్లీ, ఉప్మా, ఓట్స్... షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు ఏది బెస్ట్ అంటే...?

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కింగ్ లాగా తినాలి అనేది పాత నానుడి...ఏది పడితే అది కాకుండా జ్ఞానంతో తినాలి అనేది ఇప్పటి మాట. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్త వచించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఎందుకంటే..మనం ఉదయం తీసుకునే ఆహారం రోజంతా షుగర్ లెవెల్స్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి. చాలామంది టీ,కాఫీలతో తమతో డే స్టార్ట్ చేస్తారు, మరికొంతమంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఇది బ్యాడ్ హ్యాబిట్ కాకపోయినప్పటికీ... మెటబాలిజంను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందని అంటున్నారు డాక్టర్లు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ కి అనుకూలమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే:

బ్రేక్ ఫాస్ట్ అంటే ఏదోకటి తినడం కాదు... సరైనది తినడం. సరైన బ్రేక్ ఫాస్ట్ లో నాణ్యమైన ప్రోటీన్, ఫైబర్, అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉండాలని అంటున్నారు డాక్టర్లు.

హెల్తీ, క్వాలిటీ ప్రోటీన్: గుడ్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు, మొలకలు, పప్పుల వంటి ఆహారాల నుండి లభించే ప్రోటీన్ కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది, బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ను నియంత్రిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు: ఓట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల నుండి లభించే పీచుపదార్థం, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరింత సహాయపడుతుంది."

హెల్తీ ఫ్యాట్స్: గుప్పెడు నట్స్ లేదా విత్తనాలను తీసుకోవడం వల్ల గుండె, జీవక్రియ ఆరోగ్యానికి తోడ్పడే హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి.


ఇండియన్స్ కి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్:

ఇండియన్ ఫ్యామిలీస్ లో బ్యాలన్స్డ్ డైట్ కలిగిన బ్రేక్ ఫాస్ట్ అనేది కొత్త విషయం కాదు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించి ఎక్కువ శక్తినిచ్చే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ఇవి.. 

  • కూరగాయల ఓట్స్, మిల్లెట్ ఉప్మా
  • పెరుగుతో పెసరపప్పు చిల్లా
  • సాంబార్‌తో ఇడ్లీ
  • వేరుశెనగలతో కూరగాయల పోహా
  • పీనట్ బట్టర్, ఉడికించిన గుడ్డుతో హోల్ గ్రైన్ టోస్ట్