ఇయ్యాల(నవంబర్ 26న) ‘సంవిధాన్ రక్షా మార్చ్’..ఏఐసీసీ పిలుపు మేరకు భారీ ర్యాలీకి పీసీసీ సన్నాహాలు

ఇయ్యాల(నవంబర్ 26న) ‘సంవిధాన్ రక్షా మార్చ్’..ఏఐసీసీ పిలుపు మేరకు భారీ ర్యాలీకి పీసీసీ సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరుతో గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్​ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు  ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. 

హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సిటీని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లోని మొత్తం 37  నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, జనాన్ని తరలించేందుకు పీసీసీ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక నేతను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించి, జన సమీకరణ బాధ్యతను అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీఎం సందీప్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొననున్నారు.