హుడా హైట్స్ ప్లాట్ల వేలానికి ఒక్కరూ రాలే.. కొనుగోలుకు ముందుకురాని బిడ్డర్లు

హుడా హైట్స్ ప్లాట్ల వేలానికి ఒక్కరూ రాలే.. కొనుగోలుకు ముందుకురాని బిడ్డర్లు

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: బంజారాహిల్స్‌‌ హుడా హైట్స్‌‌లో ప్రీమియం ప్లాట్ల విక్రయానికి హెచ్‌‌ఎండీఏ నిర్వహించిన ఈ -వేలానికి స్పందన కరువైంది. బుధవారం నిర్వహించిన వేలంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పెట్టుబడిదారులు, రియల్‌‌ ఎస్టేట్‌‌ డెవలపర్లు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా విస్తృత ప్రచారం కల్పించినప్పటికీ బిడ్డర్లు ఆసక్తి చూపలేదు. దీంతో మరోసారి ఈ-వేలం నిర్వహించనున్నట్లు హెచ్‌‌ఎండీఏ అధికారులు తెలిపారు. వేలం తేదీ, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 

షేక్‌‌పేట మండలం హకీంపేట పరిధిలోని హుడా హైట్స్‌‌ ప్రాంతంలో ప్రీమియం ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌‌ఎండీఏ ఈ-వేలం చేపట్టింది. వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ ప్లాట్లకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు ఆశించారు. కానీ వేలంలో ఒక్క బిడ్డర్‌‌ పాల్గొనకపోవడంతో మళ్లీ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చేనెలలో ఈ వేలం జరిగే అవకాశం ఉంది. కాగా, భూములు అమ్మొద్దని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు నిర్వహించడంతోనే ఈ వేలానికి ఎవరూ రాలేనట్టు తెలుస్తోంది.