అండాల అక్రమ దందా కేసులో కేటీఆరే సూత్రధారి : విప్ బల్మూరి వెంకట్

అండాల అక్రమ దందా కేసులో కేటీఆరే సూత్రధారి : విప్ బల్మూరి వెంకట్
  •     కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే నోరు విప్పాలని  విప్ బల్మూరి వెంకట్ సవాల్

హైదరాబాద్, వెలుగు: అండాల అక్రమ దందా సూత్రధారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గేదెల వెంకట సూర్య కిరణ్ కేటీఆర్ బాల్యమిత్రుడని, అతడికి చెందిన పలు సంస్థల్లో కేటీఆర్ కుటుంబ సభ్యులకు వాటాలున్నాయని తెలిపారు. తాను చేసిన ఆరోపణలపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ము, ధైర్యం ఉంటే స్పందించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు బుధవారం సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీలో మీడియాతో బల్మూరి వెంకట్ మాట్లాడారు. 

సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ భార్య కల్వకుంట్ల శైలిమ, వెంకట సూర్య కిరణ్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆయన తెలిపారు. కేటీఆర్ బినామీయే వెంకట సూర్య కిరణ్ అని, ఈ కేసు నిందితుడికి అసలు గాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాదర్ కేటీఆరేనని ఆరోపించారు. మహిళల అండాలను అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సద్గురు సంస్థలో శైలిమ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూములను కూడా కేటాయించారని గుర్తుచేశారు.   గేదెల వెంకట సూర్య కిరణ్ తన బాల్యమిత్రుడని స్వయంగా కేటీఆరే గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వెల్లడించారు.