సౌత్ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గత కొన్నినెలలుగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఆమె సినిమాల కంటే, డేటింగ్ వ్యవహారంలోనే నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా వినిపిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద దుమారమే నడించింది. మళ్ళీ అంతలోనే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ టాక్ అనంతరం..
మృణాల్, టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ మరో వార్త సోషల్ మీడియాలో మార్మోగింది. ఇటీవల ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఒకే కేఫేలో వీరిద్దరూ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ కావడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ స్పందించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రూమర్స్‌పై మృణాల్ స్వయంగా స్పందిస్తూ వాటిని కొట్టిపారేశారని తెలిపాయి.
Yashasvi Jaiswal dating Mrunal Thakur?😳 pic.twitter.com/dnr4FNSaEc
— Wickets Hitting (@offpacedelivery) July 26, 2026
ఈ డేటింగ్ విషయంపై మృణాల్.. సోషల్ మీడియా వేదికగా స్పందించినట్లు ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. మృణాల్-యశస్విని లింక్ చేస్తూ ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టగా.. దానికి హీరోయిన్ కామెంట్ చేస్తూ “బ్రో.. రిలాక్స్. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? ఎలా కనిపించాం? మీరు ఇంత చదువుకున్న వాళ్లై ఉండి ఇలాంటి పుకార్లను ఎలా నిజమని నమ్ముతున్నారు?” అంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా.. “దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. జెన్‌జీ నుంచి కొంత నేర్చుకోండి. నిజమైన సమస్యలపై వీడియోలు చేయండి. అలా చేస్తే మీకు మరిన్ని వ్యూస్ వస్తాయి” అంటూ సూచించారు. దీంతో యశస్వి జైస్వాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసినట్లైందని సమాచారం. అయితే, ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
A viral video from a Bandra cafe sparked dating rumours linking Mrunal Thakur with cricketer Yashasvi Jaiswal. But the actress seems to have had enough of the speculation! Reacting to an Instagram post about the rumours, Mrunal questioned why people were assuming they were… pic.twitter.com/Urg8c1hsrv
— India Forums (@indiaforums) August 8, 2026
ఇక యశస్వి జైస్వాల్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో యశస్వి బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయారు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో కేవలం రెండు బంతులకే డకౌట్‌గా వెనుదిరిగారు.
