ఆన్ లైన్ మోసాల గురించి పోలీసులు ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొంతమంది మాత్రం కక్కుర్తి పడుతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాల కోసం వెళ్లి కొంతమంది మోసపోతుంటే.. అమ్మాయిల పిచ్చితో మరికొంతమంది మోసపోతున్నారు. ఇదే వీక్నెస్ ను ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 6కోట్లు దండుకుంది ఓ ఖిలాడీ లేడీ. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి టిండర్ డేటింగ్ యాప్, సోషల్ మీడియా ద్వారా పురుషులను వలలో వేసుకొని... వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి భారీగా మోసానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులతో పరిచయం పెంచుకొని.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తోందని ప్రయాగ్ రాజ్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
పల్లవి సింగ్ రాజ్ పుత్ అనే యువతి డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా పురుషులను లక్ష్యంగా చేసుకొని... పరిచయం పెంచుకొని సన్నిహితంగా మెలుగుతూ... ఫోటోలు, వీడియోలు తీసుకుందని.. ఆ తర్వాత ఏవ్ ఫోటోలు, వీడియోలు ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు బాధితుడు.
అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే... అత్యాచారం, హత్యాయత్నం కేసుల్లో ఇరికిస్తానని బెదిరించిందని తెలిపాడు బాధితుడు. అలా యువతి పెట్టిన కేసుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారని పేర్కొన్నాడు బాధితుడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
