సర్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజింగ్‌‌‌‌ క్లైమాక్స్‌‌‌‌ తో అనకాపల్లి చిత్రం

సర్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజింగ్‌‌‌‌ క్లైమాక్స్‌‌‌‌ తో అనకాపల్లి చిత్రం

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్‌‌‌‌లో ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన చిత్రం ‘అనకాపల్లి’.   కాండ్రేగుల నాయుడుతో కలిసి దర్శకుడు త్రినాథరావు నక్కిన  నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత నాకు తట్టిన ఫీల్‌‌‌‌ గుడ్‌‌‌‌ లవ్‌‌‌‌ స్టోరీ ఇది.  ఇందులోని ఫ్యామిలీ డ్రామా మెప్పిస్తుంది.  ఇంటర్వెల్‌‌‌‌లో వచ్చే ట్విస్ట్‌‌‌‌ని ఎవ్వరూ ఊహించరు. క్లైమాక్స్ ఎమోషనల్‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పారు. 

ఇంటెన్స్, లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని సంధ్యా వశిష్ట చెప్పింది. ఇందులో హీరో విక్రమ్ చాలా కొత్తగా కనిపిస్తాడని, తనతో పాటు అందరి పాత్రలు ఆకట్టుకుంటాయని మరో నిర్మాత కాండ్రేగుల నాయుడు చెప్పారు.  లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘మా అబ్బాయి విక్రమ్‌‌‌‌కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థ్యాంక్స్‌‌‌‌. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తాయి.  అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా’ అన్నారు.