ఆసియా క్రీడల స్క్వాష్ విభాగంలో ఇండియా విమెన్స్ జట్టు అదరగొట్టింది. క్వార్టర్స్‌లో 2-0 తేడాతో సింగపూర్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. తొలి సింగిల్స్‌లో తన్వీ ఖన్నా 11-6, 4-11, 15-13, 11-1తో ఆయు యోంగ్ వై ఐన్‌పై గెలిచింది. రెండో సింగిల్స్‌లో అనహత్ సింగ్ 11-7, 11-3, 11-4తో ఆయు యోంగ్ వై యాన్‌ను చిత్తుచేసింది.
దాంతో అనుభవజ్ఞురాలైన జోష్నా చినప్ప కోర్టులోకి దిగాల్సిన అవసరమే రాలేదు. మెన్స్ క్వార్టర్స్‌లో ఇండియా 2–0తో కువైట్‌పై నెగ్గి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. వీర్ చోత్రానీ 12-10, 8-11, 11-0, 11-5తో బాడర్ అల్మోగ్రెబిపై, అభయ్ సింగ్ 11-3, 11-4, 11-8తో అమ్మర్ అల్తామిమిపై నెగ్గాడు. టెన్నిస్‌లో ఇండియా ప్లేయర్ సుమిత్ నగాల్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు.
