జియో అలయన్జ్లో మరిన్ని పెట్టుబడులు

జియో అలయన్జ్లో మరిన్ని పెట్టుబడులు

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్,  అలయన్జ్ యూరప్ బీవీ తమ 50:50 జాయింట్ వెంచర్ (జేవీ) అయిన 'జియో అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్'లో రైట్స్ ఇష్యూ ద్వారా చెరో రూ.320.05 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. ఈ మొత్తాన్ని వ్యాపార విస్తరణ, కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.

దీంతో ఈ జేవీలో జియో ఫైనాన్స్ మొత్తం పెట్టుబడి రూ.375 కోట్లకు చేరింది. కంపెనీ షేరు బుధవారం 0.60శాతం తగ్గింది.