కౌశిక్‌‌ రెడ్డిని సీరియస్‌ ‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కౌశిక్‌‌ రెడ్డిని సీరియస్‌ ‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  • ఆయన ఫొటోల కోసం పోటీపడే వ్యక్తి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

హై‌‌‌‌దరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి కేవలం ఫొటోల కోసం మాత్రమే పోటీ పడతారని, ఈ విషయం ఆయన పార్టీ ఎమ్మెల్యేలే అంటుంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం సీఎల్పీలో అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

అసెంబ్లీలో సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు పూర్తిగా తప్పని, ఆ విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారని, కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఆ సమావేశానికి హాజరుకాకపోవడం తప్పు అని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని స్థానిక ప్రజలు గమనిస్తారని ఆయన వెల్లడించారు.