గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు తయారీ రంగంలో ప్రత్యక్ష ఉత్పత్తి అనుభవం కల్పించడం అత్యంత కీలకమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమల్లో ఉపయోగించే ఆధునిక యంత్రాలు, ఉత్పత్తి ప్రక్రియలపై ముందే పూర్తి అవగాహన ఉంటే ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే మెరుగైన ఫలితాలు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పారు.
అనంతరం ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణలో మాస్టర్ ట్రైనర్లకు ఉన్నత స్థాయి శిక్షణ అందించేందుకు, కరికులం రూపకల్పనను ఆధునీకరించేందుకు సెంచూరియన్ వర్సిటీ అనుభవాలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు ప్రత్యక్ష ఉత్పత్తి అనుభవం, క్రెడిట్ ఆధారిత నైపుణ్య విద్య, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్ లక్ష్యంగా సెంచూరియన్ యూనివర్సిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు బృందం స్పష్టం చేసింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాణహిత - చేవెళ్లపై ముందుకెళ్తాం
న్యూఢిల్లీ, వెలుగు: ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, తాను కలిసామని ఎంపీ తెలిపారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ అంశాలను బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు. కాకా వెంకటస్వామి ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించాలని కలలు కన్నారని గుర్తు చేశారు. 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన ఆశయమన్నారు.
