ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చాలా మంది వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ.. కొందరు రీల్స్ మోజులో ఏం చేస్తున్నారో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. కన్న బిడ్డలు ప్రమాదంలో ఉన్న సంగతి గమనించకుండా రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలనే మత్తులో మునిగి తేలుతున్నారు. అలాంటి ఘటనే ఈ వీడియో. ఒక నదిపై ఉన్న బ్రిడ్జిపై వివాహిత రీల్స్ చేస్తుంది. భర్త, చిన్న పిల్లాడు కూడా ఆమెతో పాటు ఉన్నారు.
🚨SHOCKING | Woman creates video while her kid walks toward DANGER☠️ pic.twitter.com/zzHx39yr3U
— The Tatva (@thetatvaindia) August 8, 2026
కంటి ముందు ఉన్న పిల్లాడు రోడ్డు మీద నుంచి పాకుతూ బ్రిడ్జి ఎక్కుతున్నా కన్న తల్లి గమనించకుండా రీల్స్ చేయడంతో ఆమె తీవ్ర విమర్శల పాలైంది. ఆమె భర్త సకాలంలో పిల్లాడిని గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏ ఫోన్ మాట్లాడుకుంటూనో అతను కూడా ఉండుంటే పిల్లాడు కాలువలో పడిపోయేవాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను పొట్టు పొట్టు తిడుతూ కామెంట్ చేశారు.
కొందరు తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టుకునేందుకు కంటెంట్ క్రియేటర్స్గా మారి ఫేమస్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. తోచింది చేస్తూ.. నోటికొచ్చింది మాట్లాడుతూ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసి వైరల్ స్టార్స్ అయిపోతున్నారు. ఎలా అయితేనేం వైరల్ అయితే ప్రమోషన్స్ వెతుక్కుంటూ వస్తుండటం.. డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండటంతో టాలెంట్ లేనోళ్లు కూడా ఈ దారి ఎంచుకుంటున్నారు.
డబ్బు యువత రీల్స్ పిచ్చి ఎప్పుడో పరాకాష్టకు చేరింది. కేవలం యువతీ యువకులే కాదు వివాహితులు సైతం ఈ రీల్స్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. రీల్స్ రోడ్లపై, వాహనాలపై చాలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. అయితే అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. చాలా సందర్భాలలో ప్రమాదపు అంచుల్లో యువతీ యువకులు రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
