Jemimah Rodrigues Injury: ది హండ్రెడ్ ఉమెన్స్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్న భారత స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ సదర్న్ బ్రేవ్ (Southern Brave) జట్టుకు దూరమైంది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring injury) కారణంగా ఆమె టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలిగినట్లు ఫ్రాంచైజీ ధృవీకరించింది. సదర్న్ బ్రేవ్ తరఫున అత్యంత కీలక బ్యాటర్‌గా రాణిస్తున్న జెమిమా స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన చార్లీ నాట్ (Charli Knott) ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. కాగా జెమిమా ఈ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 35.75 సగటు, 131.19 స్ట్రైక్ రేట్‌తో 143 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
వరుసగా రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు:
సదర్న్ బ్రేవ్ సాధించిన వరుస విజయాల్లో జెమిమా రోడ్రిక్స్ ఇన్నింగ్స్‌లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచాయి. 36/3తో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో జెమిమా 34 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సదర్న్ బ్రేవ్‌కు 5 వికెట్ల విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. అలాగే ఆ తర్వాత మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 32 రన్స్ (స్ట్రైక్ రేట్ 145.45) చేసి జట్టు 126 పరుగులు సాధించడంలో సహాయపడింది. ఆపై బ్రేవ్ ఒక్క పరుగు తేడాతో గెలవగా, జెమిమా వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది.
సదర్న్ బ్రేవ్ ప్రస్తుత పరిస్థితి:
మొదటి 5 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సదర్న్ బ్రేవ్‌కు జెమిమా లేకపోవడం పెద్ద లోటే అని చెప్పాలి.. ఆగస్టు 3వ తేదీన వెల్ష్ ఫైర్ (Welsh Fire) తో జరిగిన మ్యాచ్‌లో 121/5 పరుగులు చేయగా, ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో ఓడించింది.
* ప్రధాన బ్యాటర్లు: లారా వోల్వార్ట్, మైయా బౌచియర్, లిజెల్ లీ.
* ప్రధాన బౌలర్లు: లారెన్ బెల్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్, సోఫీ మోలినెక్స్.
* ఆగస్టు 8వ తేదీన, శనివారం సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌తో పెనాల్టిమేట్ లీగ్ మ్యాచ్‌లో బ్రేవ్ తలపడనుంది. జెమిమా లేని లోటును చార్లీ నాట్ ఏ మేరకు భర్తీ చేస్తుందో చూడాలి మరీ.
Jemimah Rodrigues 🔁 Charli Knott
— Southern_Brave (@southernbrave_) August 8, 2026
We can confirm that due to an injury suffered by Jemimah Rodrigues, we’ve signed Charli Knott as our injury replacement for the remainder of The Hundred 💯
Wishing you a speedy recovery, Jemi 🙏💙 pic.twitter.com/gy0LC14klh
