బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను తొక్కేసిన సౌత్ భామలు.. నేషనల్ లెవెల్ 'నెంబర్ 1' గా సామ్ రికార్డు!

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను తొక్కేసిన సౌత్ భామలు.. నేషనల్ లెవెల్ 'నెంబర్ 1' గా సామ్ రికార్డు!

ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. దాంతో పాటే హీరోయిన్ల క్రేజ్ గ్రాఫ్ కూడా వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు బాలీవుడ్ సుందరీమణులే సినీ రంగాన్ని ఏలేవారనే మాటను తిరగరాస్తూ.. సౌత్ భామలు నేషనల్ వైడ్ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. లేటెస్ట్ గా ఓర్మాక్స్ మీడియా ఆగస్ట్ 2026లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ కథానాయికల జాబితాను రిలీజ్ చేసింది. ఇది దక్షిణాది సినీ భామల హవాను స్పష్టం చేస్తోంది.

హిందీ చిత్రసీమలోని దిగ్గజ హీరోయిన్లను పక్కకు నెట్టి, టాలీవుడ్ స్టార్ క్వీన్ సమంత రూత్ ప్రభు దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన కథానాయికగా మొదటి స్థానాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఆలియా భట్, దీపికా పదుకొణె వంటి అగ్ర నటీమణులను వెనక్కి నెట్టి సామ్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ టాప్-10 జాబితాలో ఏకంగా 6 స్థానాలను సౌత్ ఇండియన్ భామలే కైవసం చేసుకోవడం గమనార్హం. సమంతతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ( 5), త్రిష ( ), కాజల్ అగర్వాల్( 6), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ( 4), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( 7 ) తమ క్రేజ్ ని నిలబెట్టుకున్నారు. ఇక బాలీవుడ్ నుంచి కేవలం ఆలియా ( 2) , దీపికా (3), శ్రద్ధా కపూర్ ( 10), కృతి సనన్ ( 8) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకోగలిగారు.

సమంత వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తనకున్న ఫ్యాన్ బేస్, క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవల విడుదలై రూ.100 కోట్ల మైలురాయిని దాటిన టాలీవుడ్ యాక్షన్-కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' భారీ విజయం సాధించడంతో సామ్ పాపులారిటీ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. సరైన కంటెంట్ పడితే సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయగలదో ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

మరోవైపు గ్లోబల్ వైడ్ హల్ చల్ చేస్తున్న ప్రియాంక చోప్రా వంటి భామలు కూడా ఈ టాప్-10 రేసులో వెనకబడిపోవడం గమనార్హం. ఏది ఏమైనా సౌత్ భామల కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన నటన , పాన్-ఇండియా సినిమాల జోరు చూస్తుంటే... రాబోయే రోజుల్లోనూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ లేడీ సూపర్ స్టార్ల హవానే నడవనుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ormax Media (@ormaxmedia)