మీ ఫోన్ నంబర్ మిమ్మల్ని ధనవంతులని చేస్తుందా ? న్యూమరాలజీ సీక్రెట్ ట్రిక్ ఇదే !

 మీ ఫోన్ నంబర్ మిమ్మల్ని ధనవంతులని చేస్తుందా ? న్యూమరాలజీ సీక్రెట్  ట్రిక్ ఇదే !

మీ మొబైల్ నంబర్ మీ జాతకాన్ని మార్చగలదా..? మీ ఫోన్ నంబర్ చివరి అంకెలతో మీరు ధనవంతులు కాగలరా..? అనేది సంఖ్యాశాస్త్రం (Numerology) ఆధారంగా చాలా మందికి ఉన్న ఆసక్తికరమైన సందేహం. ఈ రోజుల్లో ఫోన్ నంబర్ కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదు, మన ఐడెంటిటీలో అంటే మన గుర్తింపులో కూడా ఒక భాగమైపోయింది. న్యూమరాలజీ ప్రకారం, ఈ నంబర్ల వెనుక ఉన్న ఎనర్జీ మన జీవితంపై, ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితిపై బలమైన ప్రభావం చూపుతుంది. సరిగ్గా చెప్పాలంటే, మీ 10 అంకెల మొబైల్ నంబర్‌లోని చివరి 4 అంకెలు మీ అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి!

లక్కీ మొబైల్ నంబర్‌ను ఎలా గుర్తుపట్టాలి?
మీ ఫోన్ నంబర్ చివరి నాలుగు అంకెలు పైకి పెరుగుతున్నట్టు ఉంటే (ఉదాహరణకు: 6789) అది చాలా శుభ పరిణామం. ఇది మీ కెరీర్, ఆదాయం క్రమంగా ఎదుగుతాయనడానికి సంకేతం!

25 లేదా 52 కాంబినేషన్:
మీ నంబర్ చివర 25 లేదా 52 అని ఉంటే, అది లక్ష్మీదేవి కటాక్షాన్ని, జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుందని నమ్ముతారు.

5 అంకె (బుధుడు): తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం, ధన ప్రాప్తికి సూచిక.

2 అంకె (చంద్రుడు): సృజనాత్మకత (Creativity), కొత్త ఆలోచనలకు ప్రతీక.

ఈ రెండు అంకెలు కలవడం వల్ల సరైన సమయంలో సరైన రిస్క్ తీసుకునే ధైర్యం వస్తుంది. బుధ, శుక్ర గ్రహాల ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మికత, సమాజంలో మంచి పేరు లభిస్తాయి.

మీ నంబర్ అదృష్ట సంఖ్యను ఎలా లెక్కించాలి ?  మీ ఫోన్ నంబర్ మీకు కలసి వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ చిన్న లెక్కలు చేయండి:

స్టెప్ 1: కంట్రీ కోడ్ లేకుండా మీ 10 అంకెల మొబైల్ నంబర్ తీసుకోండి. (ఉదాహరణకు: 7827615189)

స్టెప్ 2: అందులో చివరి 4 అంకెలను మాత్రమే తీసుకోండి. (ఇక్కడ చివరి అంకెలు: 5189)

స్టెప్ 3: ఆ నాలుగు అంకెలను కలపండి. 5 + 1 + 8 + 9 = 23 

స్టెప్ 4: వచ్చిన జవాబును మళ్లీ ఒకే అంకె వచ్చే వరకు కూడండి.  2 + 3 = 5 

ఈ ఉదాహరణలో సింగిల్ డిజిట్ "5" వచ్చింది. ఇది బుధుడి సంఖ్య కాబట్టి వ్యాపారం, ధన లాభాలు ఇంకా తెలివితేటలకు చాలా మంచిదని భావిస్తారు. మీ నంబర్ చివరి 4 అంకెల మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి!