రంగుల లైట్లు.. బిర్యానీ ప్లేట్లు.. ఐటీ కారిడార్లో కొత్త నైట్లైఫ్

రంగుల లైట్లు.. బిర్యానీ ప్లేట్లు.. ఐటీ కారిడార్లో  కొత్త నైట్లైఫ్

హైదరాబాద్ హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌‌‌‌కు ఫుడ్ ట్రక్​లు కొత్త ఆకర్షణగా మారాయి. పగలు ఉద్యోగులతో పరుగులు పెట్టే ఈ ప్రాంతాలు, రాత్రయితే ఫుడ్ ట్రక్కుల వెలుగులతో మెరుస్తూ కనిపిస్తున్నాయి. 11 గంటలు దాటాక మాదాపూర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, దుర్గం చెరువు, నానక్‌‌‌‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లు చూస్తే అక్కడి వాతావరణం చిన్నపాటి ఫుడ్ ఫెస్టివల్‌‌‌‌లా ఉంటుంది. రంగుల లైట్ల మధ్య చేతిలో బిర్యానీ ప్లేట్లు పట్టుకుని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ యువత సందడి చేస్తోంది​. 

ఒకప్పుడు రాత్రి వేళల్లో బయట తినాలంటే పెద్దగా ఆప్షన్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు, స్నేహితుల గ్యాంగ్​లు, ఫ్యామిలీలు కూడా ఫుడ్ ట్రక్కుల దగ్గరకు వచ్చి కాసేపు రిలాక్స్ అవుతున్నారు. తక్కువ ఖర్చులో మంచి రుచి, ఓపెన్ ఎయిర్ వాతావరణం, కాస్త ఫన్‌‌‌‌గా గడపడానికి అవకాశం ఉండటంతో ఫుడ్ ట్రక్కులు యూత్‌‌‌‌కి ఇష్టమైన హ్యాంగ్‌‌‌‌అవుట్ స్పాట్స్‌‌‌‌గా మారిపోయాయి. 

ఏం తింటున్నారు అంటే...

ఇక్కడ దొరకని రుచి అంటూ లేదు. బిర్యానీ, షవర్మా, గ్రిల్డ్ చికెన్, మొమోస్, పాస్తా, బర్గర్లు, మ్యాగీ, డెజర్ట్స్, టీ, కాఫీ ఇలా అన్నీ ఒకచోటే దొరుకుతున్నాయి. అందుకే ఆఫీస్​ అయిపోయాక లేదా వీకెండ్ నైట్‌‌‌‌లో సరదాగా బయటకు రావాలనుకునేవాళ్లు చాలామంది ఈ ఫుడ్ ట్రక్కుల వైపు వస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రద్దీ ఎంతలా ఉంటుందంటే, పార్కింగ్‌‌‌‌కి ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తోంది.

సోషల్ మీడియా క్రేజ్ కూడా

ఈ ఫుడ్ ట్రక్కుల హవా పెరగడానికి సోషల్ మీడియా కూడా పెద్ద కారణమే. ఇన్‌‌‌‌స్టాగ్రామ్, యూట్యూబ్‌‌‌‌లో ఫుడ్ బ్లాగర్లు ఈ స్పాట్స్‌‌‌‌ని బాగా చూపించడంతో యువతలో మరింత క్రేజ్ పెరిగింది. ఓపెన్ స్పేస్, లైటింగ్, స్టైలిష్ బ్యాక్‌‌‌‌డ్రాప్ ఉండటంతో చాలామంది ఇక్కడ రీల్స్, ఫొటోలు తీసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

చిన్న వ్యాపారాలకు పెద్ద అవకాశం

ఫుడ్ ట్రక్కులు కేవలం కస్టమర్లకే కాదు.. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్లకూ బెస్ట్ చాయిస్​గా కనిపిస్తున్నాయి. పెద్ద రెస్టారెంట్ పెట్టడానికి కావాల్సిన ఖర్చుతో పోలిస్తే, ఫుడ్ ట్రక్ తక్కువ పెట్టుబడితో ప్రారంభించొచ్చు. అందుకే చాలామంది యంగ్​ ఎంట్రప్రెన్యూర్స్ కొత్త వంటకాలు, కొత్త కాన్సెప్ట్‌‌‌‌లతో ఈ రంగంలోకి వస్తున్నారు.

సిటీలో నైట్‌‌‌‌లైఫ్‌‌‌‌కి కొత్త నిర్వచనం

హైటెక్ సిటీ ఇప్పుడు రాత్రి వేళల్లో ఐటీ ఉద్యోగుల ఆకలిని తీర్చడమే కాదు. కాస్త రిలాక్స్ అవ్వడానికి, స్నేహితులతో టైం గడపడానికి, కొత్త రుచులు ట్రై చేయడానికి ఇది మంచి స్పాట్‌‌‌‌గా మారింది. హైదరాబాద్ నైట్‌‌‌‌లైఫ్‌‌‌‌కి ఫుడ్ ట్రక్కులు ఇప్పుడు కొత్త నిర్వచనం ఇస్తున్నాయి.

ఫుడ్ లవర్స్‌‌‌‌కు ఫేవరెట్ స్పాట్స్

మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫెయిర్, టెక్నో ఎన్‌‌‌‌క్లేవ్ వైపు ఉన్న 5 స్టేట్స్ హాస్పిటాలిటీ ఫుడ్ ట్రక్, సిలికాన్ వ్యాలీ దగ్గర గ్రిల్ ట్రక్, కోహినూర్ రోడ్డులో చికెన్ జూ ఫుడ్ ట్రక్, ఖాజాగూడ సరస్సు సమీపంలో నక్షత్ర హోమ్లీ ఫుడ్ ట్రక్, గచ్చిబౌలిలో స్ట్రీట్ ఫ్లేవర్స్ ఫుడ్ ట్రక్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. ఒక్కో ట్రక్‌‌‌‌కి ఒక్కో స్పెషాలిటీ ఉండటంతో ఫుడ్ లవర్స్ మళ్లీ మళ్లీ అక్కడికే వస్తున్నారు.