ఒక్క చిన్న తప్పు జీవితాన్నే నాశనం చేస్తుంది.. ఎమోషనల్ లవ్ డ్రామా 'తెల్ల కాగితం' ట్రైలర్ రిలీజ్!

ఒక్క చిన్న తప్పు జీవితాన్నే నాశనం చేస్తుంది.. ఎమోషనల్ లవ్ డ్రామా 'తెల్ల కాగితం' ట్రైలర్ రిలీజ్!

టాలీవుడ్ యంగ్ నటుడు హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో, నక్షత్ర హీరోయిన్‌గా వస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ డ్రామా 'తెల్ల కాగితం' (Thellakaagitham). రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభించగా.. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఇది ఈ సినిమాపై క్రేజ్‌ను మరింత రెట్టింపు చేస్తోంది.

పక్కా టీనేజ్ స్కూల్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు. తెలిసీ తెలియని పసి వయసులో పుట్టే ప్రేమ, ఆ వయసులో ఆవేశంలో, తొందరపాటులో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయనేది చిత్ర కథాంశం.  'ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది' అంటూ ట్రైలర్‌లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్ కథలోని అసలు నిజాన్ని, భావోద్వేగ తీవ్రతను ఆవిష్కరిస్తోంది.

అజయ్, దీపక్ కీలక పాత్రల్లో మెరవగా, 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ అందించిన మెలోడీ సంగీతం, నేపధ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్కూల్ లైఫ్ జ్ఞాపకాలను, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్యూర్ టీనేజ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ 'తెల్ల కాగితం' యూత్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.