వినాయక నిమజ్జనం వచ్చేస్తోంది. శుక్రవారం ( సెప్టెంబర్ 25 ) నిమజ్జనం రావడంతో ఐటీ బాబులు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలకు కూడా హాలిడే కాబట్టి పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు నిమజ్జనంలో తీన్మార్ స్టెప్పులు వేసి ఎంజాయ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందరి బాధ ఇలా ఉంటే.. మందు బాబుల బాధ మరోలా ఉంది.. ఎందుకంటే.. శుక్రవారం హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
శుక్రవారం ( సెప్టెంబర్ 25 ) ఉదయం 6 గంటల నుండి శనివారం ( సెప్టెంబర్ 26 ) ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమించి వైన్ షాపులు తెరిచినా బ్లాక్ లో మందు అమ్మినా కఠిన చర్యలు తప్పాని హెచ్చరించింది ప్రభుత్వం.
అయితే... శుక్రవారం వైన్స్ బంద్ కాబట్టి ముందే సరుకు తెచ్చి పెట్టుకుందాం లేకపోతే.. బ్లాక్ లో కొందాంలే అనుకుంటున్న మందు బాబులకు విజ్ఞప్తి... తాగేవాళ్ళు ఎలాగో ప్రతిరోజూ, ప్రతి వీకెండ్ తాగుతూనే ఉంటారు... వైన్స్ బంద్ ఉన్న ఒక్కరోజైనా తాగకుండా ఉంటే లివర్ కి రెస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది.. ఆలోచించండి ఒక్కరోజైనా బుద్దిగా ఉండండి బాస్..
