Esther Anil: సినిమాలు, చదువు రెండింట్లోనూ సూపర్ సక్సెస్.. ‘దృశ్యం పాప’ఎస్తర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

Esther Anil: సినిమాలు, చదువు రెండింట్లోనూ సూపర్ సక్సెస్.. ‘దృశ్యం పాప’ఎస్తర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

ఎస్తర్ అనిల్ (Esther Anil).. 2013లో రిలీజ్​ అయిన మలయాళ మూవీ ‘దృశ్యం’లో మోహన్‌‌లాల్ కుమార్తె అనుమోల్‌‌గా నటించింది. నేడు సౌత్​ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతేకాదు, సినిమా కెరీర్‌‌ను కొనసాగిస్తూనే ఉన్నత విద్య పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. ఆమె జర్నీలోని ఇంట్రెస్టింగ్​ విశేషాలు ఇవి..

కేరళలోని వయనాడ్‌‌లో జన్మించిన ఎస్తర్ తల్లిదండ్రులు మంజు, అనిల్ అబ్రహాం, ఆమె కలలకు కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచిందని ఎస్తర్ అనేక సందర్భాల్లో చెప్పింది. ముఖ్యంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్​లో చదవాలన్న ఆమె కలను సాకారం అయిందంటే అది కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లేనని చెప్పింది. అలా చదువు కొనసాగిస్తూనే ఆర్టిస్ట్​గానూ ఎదిగింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esther (@_estheranil)

చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండడంతో టీవీ షోల్లో పాల్గొంటూ తన టాలెంట్​ ప్రూవ్ చేసుకుంది. అదే ఆమెను సినిమాలవైపు నడిపించింది. 2010లో ‘నల్లవన్’ చిత్రంతో బాలనటిగా సినీరంగంలోకి వచ్చింది ఎస్తర్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అలా కెమెరా ముందు ఎలా ఉండాలి? ఎలా నటించాలి? అనే విషయాలు చిన్నప్పుడే నేర్చుకుంది. 

మూడు భాషల్లో ఒకే పాత్ర

ఆమె జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా దృశ్యం. ఈ సినిమాలో అనుమోల్ పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఒక మామూలు ఫ్యామిలీలో జరిగే అసాధారణ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎస్తర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘దృశ్యం’ సక్సెస్​తో ఒక్కసారిగా ఎస్తర్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. సాధారణంగా రీమేక్‌‌లలో నటీనటులు మారిపోతుంటారు. కానీ ఎస్తర్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఆ పాత్రలో ఆమె అంతగా ఒదిగిపోయింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె వెంకటేశ్ కుమార్తెగా గుర్తుండిపోగా, తమిళ ప్రేక్షకులకు కమల్ హాసన్ కుమార్తెగా పరిచయమైంది. మూడు భాషల్లో ఒకే పాత్ర ద్వారా గుర్తింపు పొందిన అరుదైన బాలనటిగా ఎస్తర్ ప్రత్యేక స్థానం సంపాదించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esther (@_estheranil)

బాలనటి ఇమేజ్‌‌ను దాటి..

సినిమా రంగంలో బాలనటిగా పేరు తెచ్చుకోవడం ఒక చాలెంజ్​ అయితే, ఆ ఇమేజ్ నుంచి బయటపడి హీరోయిన్‌‌గా నిలబడటం మరో పెద్ద సవాలు. ఎందరో బాలనటులు ఆ దశలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్తర్ కూడా అదే పరీక్షను ఎదుర్కొంది. కానీ ఆమె తొందరపడలేదు. గ్లామర్ పాత్రల కోసం పరుగులు తీయకుండా తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగింది. తెలుగులో ‘జోహార్’ సినిమాలో లీడ్​ రోల్​ చేసి నటిగా మరో కోణాన్ని చూపించింది. 2024లో విడుదలైన తమిళ చిత్రం మినిమినిలో ఎస్తర్ నటన ప్రశంసలు అందుకుంది. యువత ఎదుర్కొనే భావోద్వేగ ప్రయాణాన్ని చూపించే ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె సినిమా సెలక్షన్స్​లో కూడా కొత్తదనం కనిపిస్తోంది. మలయాళం, తమిళ భాషల్లోనూ విభిన్న కథలతో ప్రయోగాలు చేసింది. తన కెరీర్‌‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ సాగుతోంది.

చదువుకూ సమాన ప్రాధాన్యం

చాలామంది నటీనటులు కెరీర్ కోసం చదువును పక్కన పెట్టేస్తారు. కానీ ఎస్తర్ అనిల్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. నటనతో పాటు విద్యను కూడా సమానంగా కొనసాగించింది. ఈమధ్యే ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్​లో ఇంటర్నేషనల్ డెవలప్‌‌మెంట్‌‌లో మాస్టర్స్ పూర్తి చేసి డిస్టింక్షన్ సాధించింది. అక్కడ చదివిన అనుభవం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని, ముఖ్యంగా మహిళలు, సమాజం, అధికారం వంటి అంశాలపై మరింత లోతుగా ఆలోచించేలా చేసిందని ఆమె చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎల్‌‌ఎస్‌‌ఈలో చదవడం తన చిన్నప్పటి కల అని, ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పింది. సినీ కెరీర్‌‌తోపాటు విద్యను కూడా సక్సెస్​గా కొనసాగించడం యూత్​కు ఆదర్శంగా నిలిచింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esther (@_estheranil)

సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్

సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎస్తర్‌‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. తన ప్రయాణం, ఫొటోషూట్లు, విద్య, జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్​లో కేవలం గ్లామర్ మాత్రమే కనిపించదు. పర్సనల్ డెవలప్​మెంట్​, చదువు, ట్రావెలింగ్​, లైఫ్​ ఎక్స్​పీరియెన్స్​లు కూడా కనిపిస్తాయి. అదే ఆమెను ఇతర యంగ్ యాక్ట్రెస్​లలో డిఫరెంట్​గా నిలబెడుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esther (@_estheranil)

ఇప్పటికీ ‘దృశ్యం పాప’గానే..

ఎన్ని సినిమాలు చేసినా ఎస్తర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది దృశ్యంలోని అనుమోల్ పాత్రే. రీసెంట్​గా ఒక ఇంటర్వ్యూలో కూడా అభిమానులు ఇప్పటికీ తనను ‘‘దృశ్యం పాప’’గానే పిలుస్తుంటారని ఆమె చెప్పింది. సాధారణంగా నటులు తమ పాత పాత్రల నుంచి బయటపడాలని కోరుకుంటారు. కానీ ఎస్తర్ మాత్రం ఆ గుర్తింపును ప్రేమగా స్వీకరిస్తుంది. ఒక పాత్ర ప్రేక్షకుల జ్ఞాపకాలలో దశాబ్దాల పాటు నిలవడం చాలా అరుదు. ఎస్తర్‌‌కు ఆ అదృష్టం దక్కింది. ప్రస్తుతం ఎస్తర్ అనిల్ కెరీర్‌‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ దృశ్యం 3. మోహన్‌‌లాల్, మీనా, అంసిబా హసన్‌‌లతో కలిసి ఆమె మరోసారి అనుమోల్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రం విడుదలై మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.