భార్య, పిల్లలకు అన్నంలో విషం కలిపి, తాను ఉరేసుకొని.. అంత్యక్రియలకు ఫోన్ పే డబ్బులు వాడండంటూ... పిన్ నంబర్ రాసి...

భార్య, పిల్లలకు అన్నంలో విషం కలిపి, తాను ఉరేసుకొని.. అంత్యక్రియలకు ఫోన్ పే డబ్బులు వాడండంటూ... పిన్ నంబర్ రాసి...

ఏపీలోని చిత్తూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సోమవారం ( జూన్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బంగారెడ్డిపల్లికి చెందిన దాము భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, పిల్లలకు అన్నంలో విషం కలిపి... తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంత్యక్రియలకు తన డబ్బులే వాడాలంటూ ఫోన్ పే పిన్ నంబర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు దాము.

దాము భార్య నిర్మలకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఫోన్ పే లోని తన డబ్బులతో అంత్యక్రియలు చేయాలని పిన్ నెంబరు సూసైడ్ నోట్ లో రాశాడు దామోదర్. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ లో రాశాడు దామోదర్.

ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.