ఇంగ్లండ్‌‌ తో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ కు కోహ్లీ ఆగయా..

ఇంగ్లండ్‌‌ తో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ కు కోహ్లీ ఆగయా..

న్యూఢిల్లీ:  ఇంగ్లండ్‌‌తో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు 15 మందితో కూడిన ఇండియా టీమ్‌‌ను ఆదివారం ప్రకటించారు. స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌ కోహ్లీని జట్టులోకి తీసుకున్నారు. అయితే హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ గాయంతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ ఫిట్‌‌నెస్‌‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ గాయంతో ఇటీవల అఫ్గానిస్తాన్‌‌తో వన్డే సిరీస్‌‌కు కోహ్లీ దూరమయ్యాడు. మిగతా జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కోహ్లీ రాకతో అఫ్గానిస్తాన్‌‌పై రెండు సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌‌ను టీమ్‌‌ నుంచి తప్పించారు.

దాంతో హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మతో కలిసి శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఓపెనింగ్‌‌ చేయనున్నాడు. బ్యాకప్‌‌ ఓపెనర్‌‌గా ఇషాన్‌‌ కిషన్‌‌ను తీసుకున్నారు. వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా రెస్ట్‌‌ ఇచ్చిన పేసర్‌‌ జస్ప్రీత్‌‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్‌‌ హర్ష్ దూబే ప్లేస్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌ అక్షర్‌‌ పటేల్‌‌కు చోటు కల్పించారు. వచ్చే నెల 14, 16, 19న ఇంగ్లండ్‌‌తో ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. మరోవైపు ఐర్లాండ్‌‌తో జరిగే టీ20 సిరీస్‌‌కు స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి దూరమయ్యాడు. ఎడమ కాలి గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. 

వన్డే జట్టు: శుభ్‌‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్