సగం మంది డ్రైవర్లకు తెలియదు.. గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే 9 అదిరిపోయే ఫీచర్లు ఇవే !

సగం మంది డ్రైవర్లకు తెలియదు.. గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే 9 అదిరిపోయే ఫీచర్లు ఇవే !

గూగుల్ మ్యాప్స్ మనందరి ఫోన్లలోనూ ఉంటుంది. కానీ, చాలా మంది దీనిని కేవలం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళడానికి, ఎక్కడికైనా వెళ్లేందుకు దారి తెలుసుకోవడానికి మాత్రమే వాడుతుంటారు. నిజానికి, ఇందులో డ్రైవింగ్‌ను మరింత ఈజీగా, సేఫ్ గా మార్చే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, షార్ట్‌కట్లు ఉన్నాయి. ఒక డ్రైవర్‌గా మీరు వీటిని తెలుసుకుంటే, మీ జర్నీలో టెన్షన్ సగం తగ్గిపోతుంది. ప్రతి డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవలసిన  9 గూగుల్ మ్యాప్స్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం....

1. ఎడమ, కుడి వైపుకు స్వైప్ చేయడం
మీరు జర్నీ స్టార్ట్ చేసే ముందే, ఎక్కడెక్కడ ఎలాంటి టర్నింగ్స్  రాబోతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మ్యాప్‌లో పైన కనిపించే డైరెక్షన్ బాక్స్‌పై వేలితో ఎడమ లేదా కుడి వైపునకు స్వైప్ చేస్తే చాలు. మీ నెక్స్ట్  టర్నింగ్ ఏంటో స్క్రీన్‌పైనే క్లియర్ ప్రివ్యూ కనిపిస్తుంది. సిటీ నగరాల్లో  రోడ్లలో వెళ్లేటప్పుడు ఈ ఫీచర్ చాల బాగా ఉపయోగపడుతుంది.  ఫోన్లలోనే కాకుండా కార్లలోని ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలలో కూడా పని చేస్తుంది.

2. మ్యాప్‌లో మీరు ఉన్న చోటుకి 
డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి వేరే రూట్లు చూడటానికి మ్యాప్‌ను అటూ ఇటూ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మళ్లీ మనం ప్రస్తుతం ఉన్న చోటుకి మ్యాప్ రావాలంటే వెతుక్కోవాల్సిన పనిలేదు. స్క్రీన్‌పై ఉండే 'Re-center' బటన్ నొక్కితే మ్యాప్ వెంటనే మీరు ఉన్న లొకేషన్‌కు వచ్చేస్తుంది. ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ బటన్ నొక్కడం కుదరకపోతే, "ఓకే గూగుల్, రీ-సెంటర్" (Ok Google, Re-center) అని చెప్తే వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఇది జరిగిపోతుంది.

►ALSO READ | 16 రకాల కాంబినేషన్ మందులపై నిషేధం..మీరు వాడుతున్నారా? లిస్ట్ చెక్ చేసుకోండి

3. రెండు వేళ్లతో మ్యాప్‌ను తిప్పడం  
మ్యాప్ చూసేటప్పుడు స్క్రీన్ పై భాగం ఎప్పుడూ ఉత్తరం (North) వైపే ఉండాలనుకునే వారు కొందరు ఉంటారు. అలాంటి వారు మ్యాప్ యాంగిల్ మార్చుకోవడానికి స్క్రీన్‌పై రెండు వేళ్లు ఉంచి, క్లాక్ వైజ్ లో  లేదా యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పవచ్చు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్ల దిశలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

4. మధ్యలో ఎక్కడైనా ఆగాలంటే 
లాంగ్ జర్నీలో వెళ్లేటప్పుడు మధ్యలో పెట్రోల్ బంక్, హోటల్ లేదా కాఫీ షాప్ దగ్గర ఆగాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఉన్న నావిగేషన్‌ను క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్తగా సెట్ చేయక్కర్లేదు. మ్యాప్‌లో మీకు కావలసిన చోట ట్యాప్ చేసి "Add stop" అని నొక్కితే చాలు, అది మీ రూట్ లోనే ఒక స్టాప్‌గా యాడ్ అయిపోతుంది లేదా సెర్చ్ బార్‌లో నేరుగా వెతికి కూడా యాడ్ చేసుకోవచ్చు.

5. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ గురించి రిపోర్ట్ చేయడం
మీరు వెళ్లే దారిలో ఏదైనా ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ నిలిచిపోయినా, రోడ్డు పనులు జరుగుతున్నా ఆ విషయాన్ని మ్యాప్‌లోని రిపోర్ట్ ఐకాన్  ద్వారా గూగుల్‌కు చెప్పొచ్చు. మీరు ఇచ్చే ఈ చిన్న సమాచారం (Report) వల్ల  ఇతర డ్రైవర్లకు ఆ రూట్ అలర్ట్స్ వెళ్లి అలర్ట్ అవుతారు లేదా జాగ్రత్త పడతారు. 

6. వాయిస్ నావిగేషన్ ఆన్/ఆఫ్ చేయడం
ప్రతి టర్నింగ్ వచ్చే ముందు గూగుల్ మ్యాప్స్ మాట్లాడటం మీకు చిరాకుగా అనిపిస్తే, స్క్రీన్ కింద ఉండే స్పీకర్ ఐకాన్‌ను నొక్కి వాయిస్‌ను పూర్తిగా మ్యూట్ చేసుకోవచ్చు లేదా కేవలం ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్స్ వంటి ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పేలా 'Alerts Only' మోడ్ పెట్టుకోవచ్చు. దీనికోసం స్క్రీన్ ముట్టుకోకుండా "ఓకే గూగుల్, మ్యూట్ వాయిస్ గైడెన్స్" అని చెప్తే కూడా సరిపోతుంది.

7. మీ జర్నీ వివరాలను షేర్ చేయడం
మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, మీ ఇంట్లో వారికి లేదా ఫ్రెండ్స్ కి  మీరు ఎక్కడి వరకు వచ్చారో వాట్సాప్ లేదా మెసేజ్ లో మాటిమాటికీ చెప్పాల్సిన అవసరం లేదు. నావిగేషన్ స్క్రీన్‌ను కింద నుండి పైకి స్వైప్ చేసి 'Share trip progress' ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. మీ లైవ్ లొకేషన్, మీరు వెళ్లే దారి, మీరు ఎన్ని గంటలకు చేరుకుంటారనే వివరాలు వారికి లైవ్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇది సేఫ్టీ పరంగా చాలా మంచి ఫీచర్.

8. ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం
సిగ్నల్ లేని అడవులు, కొండ ప్రాంతాలు లేదా రిమోట్ ఏరియాలకు వెళ్లేటప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని  కాపాడుతుంది. మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి 'Offline maps' లోకి వెళ్లి, మీకు కావలసిన సిటీ లేదా ఏరియాను ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా నావిగేషన్, టర్న్ బై టర్న్ డైరెక్షన్లు పక్కాగా పనిచేస్తాయి.  

9. ఒకే ట్యాప్‌తో రూట్ మార్చుకోవడం
సాధారణంగా గూగుల్ మ్యాప్స్ మనకు అత్యంత ఫాస్టెస్ట్  రూట్‌ను బ్లూ కలర్  రంగులో చూపిస్తుంది. కానీ, అదే గమ్యస్థానానికి వెళ్లే ఇతర అల్టార్నేటివ్ దారులను బూడిద రంగు గీతలతో చూపిస్తుంది. మీకు ఆ బూడిద రంగులో ఉన్న రూట్ నచ్చితే, దానిపై జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే చాలు. వెంటనే మీ నావిగేషన్ కొత్త రూట్‌లోకి మారిపోతుంది.

ఈ టిప్స్  మీ జర్నీని చాలా ఈజీ చేస్తాయి. మీరేం చేయకపోయినా, కనీసం మీ ఊరు/ ఉండే ప్రదేశంలో లేదా ఏరియా ఆఫ్‌లైన్ మ్యాప్‌ను   ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. సిగ్నల్ లేనప్పుడు లేదా ఫోన్ సరిగ్గా పని చేయనప్పుడు ఇది మీకు చాల సహాయపడుతుంది.