ఆధ్యాత్మికం: ఇంట్లో ఇవి ఉన్నాయా...ఒకసారి చెక్ చేసుకోండి..నో డెవలప్మెంట్.. సమస్యలు వేధిస్తాయి...!

ఆధ్యాత్మికం: ఇంట్లో ఇవి ఉన్నాయా...ఒకసారి చెక్ చేసుకోండి..నో డెవలప్మెంట్.. సమస్యలు వేధిస్తాయి...!

చాలామంది చాలా కష్టపడతారు. డబ్బు కూడా బాగానే సంపాదిస్తారు.  కాని డెవలప్​ మెంట్​ విషయంలో  చాలా ఇబ్బందులు పడతారు.  సమస్యలు కూడా వేధిస్తేనే ఉంటాయి.. ఆర్థిక కష్టాలు.. ఆరోగ్య ఇబ్బందులు సరేసరి.. పైకి అంతా బాగానే ఉన్నా... లోపల మాత్రం వారి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు..ఏ విషయం చూసినా సరే ప్రోబ్లమ్స్​ ఫేస్​ చేస్తుంటారు.  అలాంటి వారి ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్​ చేసుకోండి.. 

హిందువులు.. నమ్మకాలకు.. పూజలకు.. చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ఎన్ని పూజలు చేసినా.. ఎంతమంది దేవుళ్లకు మొక్కినా అభివృద్ది విషయంలో వెనుక వరుసలోనే ఉంటారు.  సమస్యలు.. ఇబ్బందులతో సతమతవుతుంటారు.  అలాంటి వారి ఇళ్లలో ఈ వస్తువులున్నాయోమో ఒకసారి చెక్​ చేసుకోమని పండితులు చెబుతున్నారు.

ఇళ్లలో పూజ చేసేటప్పుడు దేవుడి విగ్రహాలు.. పటాలు కొంత కాలానికి దెబ్బతింటాయి.  పగిలిన విగ్రహాలు.. చినిగిన దేవుడి పటాలు ఉంటే .. ఎంత సంపాదించిన.. చేతికి డబ్బు వస్తున్నా..చిల్లిగవ్వ కూడా ఉండదు.  రోజు రోజుకు సమస్యలు పెరుగుతాయని పండితులు చెబుతున్నరు. తరచూ ఆర్థిక సమస్యలు.. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు. పగిలిన విగ్రహాలు.. ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.  వాస్తు ప్రకారంగా కూడ చాలా ఇబ్బందులు పడతారు. 

పూజా మందిరంలోనే కాదు.. ఇంట్లో ఎక్కడ చినిగిన దేవుడి పటాలు పొరపాటున ఉండకూడదు.  ఇంటి పూజామందిరంలో కొన్ని దేవుళ్ల విగ్రహాలు ఉండకూడదు.  విగ్రహాలు ఉంటే మూడు అంగుళాలకే పరిమితం కావాలి. అంతకంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు ఉంటే వెంటనే మీ దగ్గరలోని దేవాలయంలో ఇచ్చేయండి.  ఒకవేళ ఉంటే కొన్ని నియమాలు పాటించాలి. రోజూ నిత్య దీపారాధన కచ్చితంగా ఉండాలి.  సైజును బట్టి నివేదన ఉండాలి. వాటిని రోజూ నీటితో కడిగి అలంకారం చేయాలి.ధూపం.. దీపం.. నైవేద్యం కంపల్సరీగా ఉండాలి.

ప్రస్తుత జీవన విధానంలో  నిత్య పూజ అందరికి సాధ్యం కాదు.    చాలా సార్లు విగ్రహం ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా విరిగిపోతుంది, ఇది ఎందుకు జరిగిందో అర్థం కాదు. పూజా గదిలో ఉన్న దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలు పగిలిపోయినా.. మురికిగా మారినా వెంటనే వాటిని మార్చాలి. ఇలా పగిలిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం వాస్తు దోషానికి కారణమవుతుంది. వాస్తు ప్రకారం, పగిలిన లేదా పగిలిన గాజును కలిగి ఉండటం వల్ల ఇంట్లో దురదృష్టం వస్తుంది. అది ఇంట్లో వాస్తు దోషాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.