శ్రీలంక-A తో ట్రై సీరీస్ లో ఇండియా-A భారీ స్కోర్ సాధించింది. బ్యాటర్ల ఊచకోతతో స్కోర్ బోర్డు నాన్ స్టాప్ పరుగులు తీసింది. ముఖ్యంగా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరగేడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి శ్రీలంక ముందు 378 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లు.. ఇండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ దూకుడు ముందు బౌలర్లు తేలిపోయారు. 11 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. 29 బాల్స్ లలో 8 సిక్సులు, 10 ఫోర్లతో 94 రన్స్ చేసి.. మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు ప్రియాన్ష్ ఆర్య మంచి ఆరంభాన్నిచ్చాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు కాస్త నెమ్మదిగా ఆడినా.. చివర్లో మెరుపులు మెరిపిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రుతురాజ్ గైక్వాడ్ 40 ( 51 బంతులలో సిక్సు, 2 ఫోర్లు) చేశాడు. తిలక్ వర్మ 67 (90 బంతులలో సిక్సు, 4 ఫోర్లు), కుమార్ కుశాగ్ర 36 (39 బంతులలో సిక్సు, 3 ఫోర్లు) చేశారు. ఆ తర్వార చివర్లో విప్రజ్ నిగమ్ 27 (20 బంతులలో సిక్సు, 2ఫోర్లు), అనుకుల్ రాయ్ 39 (15 బంతులలో 4 సిక్సులు, ఫోర్) తో మెరుపులు మెరిపించారు. దీంతో ఇండియా భారీ స్కోర్ సాధించింది.
ఇక శ్రీలంక బౌలర్లలో మథులన్, ఫెర్నాండో, వనుజా సహన్ తలా రెండు వికెట్లుతీసుకున్నారు. మహ్మద్ సిరాజ్, అరచ్చిగే, సముదిత ఒక్కో వికెట్ తీసుకున్నారు. వనుజ సహన్, వైయస్కాంత్ తప్ప మిగతా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
