జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్.. మహిళను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి తీసుకెళ్లి..నలుగురు యువకులు అత్యాచారం..

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్.. మహిళను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి తీసుకెళ్లి..నలుగురు యువకులు అత్యాచారం..

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. మహిళను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ కి చెందిన ఒక మహిళను రెండు రోజుల క్రితం జగిత్యాలకు పిలిపించాడు మల్యాల మండలానికి చెందిన ఓ యువకుడు.

మహిళను నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి తీసుకెళ్లి మరో ముగ్గురు యువకులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు యువకుడు. అక్కడితో ఆగకుండా ఈ ఘటనను మొబైల్ లో రికార్డు చేసారని ఆరోపిస్తోంది బాధితురాలు. తనతో పాటు తన ముగ్గరు స్నేహితులతో కలవాలని ఒత్తిడి చేశారని.. ఆ తర్వాత నలుగురు కలిసి అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్యాల పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.ముగ్గురు యువకులు మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందినవారు కాగా.. మరో యువకుడు ధరూర్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.