Amazon Great Freedom Sale 2026.. తక్కువ రేటుకు వచ్చేవి ఇవే.. లిస్ట్ ఇదే !

Amazon Great Freedom Sale 2026.. తక్కువ రేటుకు వచ్చేవి ఇవే.. లిస్ట్ ఇదే !

ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ ఏడో తేదీన ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్పై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంటుందని ఇప్పటికే అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ సేల్ హాట్ ఫేవరెట్ డీల్స్ ఏంటనే ఆసక్తి కస్టమర్లలో మొదలైంది. ఇంట్లో వినియోగించుకునే గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది.

వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ఇస్తుండటం విశేషం. ఏసీలు రూ. 20,490 నుంచి మొదలవుతాయి. ప్రీమియం వాషింగ్ మెషీన్లు తక్కువ ధరకే వస్తున్నాయి. రూ. 60,990 ధర ఉన్న శాంసంగ్ 12 కేజీల 5 స్టార్ ఏఐ, వై-ఫై వాషింగ్ మెషీన్, ఈ సేల్‌లో రూ. 40,000 లోపు ధరకే వస్తుంది. అదే విధంగా.. లక్షా 21 వేలు ఉన్న శాంసంగ్ 653L 3-స్టార్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 రిఫ్రిజిరేటర్, రూ. 70,000 లోపు ధరకే ఈ సేల్లో అమ్ముతున్నారు.

Haier 598L 3-స్టార్ రిఫ్రిజిరేటర్ ప్రస్తుతం రూ. 1,40,890 ధర ఉంది. రాబోయే సేల్‌లో దీని ధర రూ. 70,000 కంటే ఎక్కువగా తగ్గుతుంది. Bosch 9 కేజీల 5-స్టార్ ఏఐ వాషింగ్ మెషీన్ అసలు ధర అయిన రూ. 59,990 నుంచి.. ఈ సేల్‌లో రూ. 30,000 కంటే తక్కువ ధరకే వస్తుంది. LG 9 కేజీల 5-స్టార్ ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 53,990 కాగా, దీని ధర ఈ సేల్లో రూ. 40,000 లోపే ఉండనుంది. Haier 520L 3-స్టార్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ. 1,55,090 కాగా, దీని ధర రూ. 80,000 కంటే తక్కువగా ఉంటుంది.