Pakistan Media: పాకిస్థాన్ మీడియాకి, అక్కడి సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి క్రికెట్ వార్తల కంటే ఫేక్ ఎడిటింగ్‌ల మీదనే ప్రేమ ఎక్కువైపోయినట్లుంది. బాబర్ అజమ్ ఏదో పెద్ద మాస్ హీరోలా బిల్డప్ ఇస్తూ, భారత మాజీ స్టార్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మొహం తిప్పేసుకున్నాడని ఒక కథనాన్ని నెట్టింట వదిలారు. ఈ పఠాన్ మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు.. నేను ఇంటర్వ్యూ ఇచ్చేదే లేదని బాబర్ ఆజం డైలాగ్ కొట్టినట్లుఆ వార్త కథలు అల్లేసి, తమలో తామే తెగ ఈ పాకీలు తెగ సంబరపడిపోయారు.
బంగ్లా రిపోర్టర్ మొహానికి పఠాన్ మాస్క్:
ఈ క్రేజీ సీన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను ఇర్ఫాన్ పఠాన్ బయట పెట్టడంతో పాకిస్తాన్ మీడియా పరువు మళ్లీ బజార్న పడ్డది. స్టేడియంలోకి కొత్తగా వచ్చిన ఒక బంగ్లాదేశీ యంగ్ రిపోర్టర్‌కు బాబర్ ఇంటర్వ్యూ నిరాకరించాడు. కానీ ఆ కుర్రాడి ఫేస్ పెడితే సోషల్ మీడియాలో వ్యూస్ రావు కదా! అందుకే మన ఎడిటింగ్ మేధావులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వాడేసి, ఆ బంగ్లా రిపోర్టర్ ఫేస్ స్థానంలో టక్కున ఇర్ఫాన్ పఠాన్ బొమ్మ అతికించేశారు. అనుకున్నట్లే లక్షల్లో వ్యూస్ వచ్చేశాయి, దీంతో పాక్ సోషల్ మీడియా బ్యాచ్ పండగ చేసుకుంది.
ALSO READ : CSK షాకింగ్ నిర్ణయం.. IPL 2027కి ముందు ధోనీతో పాటు ఆ ఐదుగురు ఔట్?
మీ ఎడిటింగ్ టాలెంట్‌కు ఒక దండం బాబోయ్:
ఈ ఫేక్ డ్రామా చూసిన ఇర్ఫాన్ పఠాన్ బిగ్గరగా నవ్వుకున్నాడు. ఏఐ వాడి వేరొకరి ముఖానికి నా ముఖం అతికించి భలే కథ అల్లారబ్బా అంటూ పాకిస్థాన్ మీడియాపై జోకులు వేశాడు. సోషల్ మీడియాలో రోజూ గాల్లోంచి ఊడిపడే ఇలాంటి ఏఐ అద్భుతాలకు స్పందిస్తూ పోతే జీవితంలో ప్రశాంతత ఉండదని పఠాన్ తేల్చేశాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేసి, హాయిగా కామెంటరీ చెస్తూ.. లెజెండ్స్ లీగ్‌లలో సిక్సర్లు కొడుతున్న పఠాన్‌ను చూసి, ఈ పాక్ మీడియా సర్కస్ ఇంకా ఎన్నాళ్లు నడుస్తుందో అని క్రికెట్ ఫ్యాన్స్ సైటైర్లు వేస్తున్నారు.
