బావిలో నీళ్లు.. ఉబికిఉబికి ఉప్పొంగుతున్నయ్.. ఐదు రోజులుగా ఇంతే.. వీడియో చూడండి !

బావిలో నీళ్లు.. ఉబికిఉబికి ఉప్పొంగుతున్నయ్.. ఐదు రోజులుగా ఇంతే.. వీడియో చూడండి !

మోర్బి: గుజరాత్లోని మోర్బి జిల్లాలో బావిలో నీళ్లు ఉబికిఉబికి పైకి పొంగిపొర్లుతుండటం కలకలం రేపింది. ఈ బావిలో నీళ్లు ఎందుకలా కల్లోలంగా మారాయనే విషయం మిస్టరీగా మారింది. చుట్టు పక్కల చాలా బావులు ఉన్నప్పటికీ ఈ ఒక్క బావిలోని నీళ్లే ఇలా కల్లోలంగా కనిపిస్తున్నాయి. మిగిలిన బావుల్లో నీళ్లు ప్రశాంతంగానే ఉన్నాయి.

మోర్బి సమీపంలోని విర్పర్దా గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో ఇలా జరిగింది. అక్కడ గత ఐదు రోజులుగా, 18 అడుగుల లోతు బావిలోని నీరు సముద్రపు అలల మాదిరిగా కల్లోలంగా కనిపిస్తున్నాయి. ఈ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. చుట్టు పక్కన గ్రామాల ప్రజలు ఆ బావిని చూసేందుకు తండోపతండాలుగా వెళుతున్నారు.

జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఈ సైలెంట్ వేవ్స్ బావిలో ఎందుకు వస్తున్నాయనే విషయంలో దర్యాప్తు జరపాలని మామ్లత్‌దార్ ఆదేశించారు. దివ్య భాస్కర్ టీం ఈ మిస్టరీపై దర్యాప్తు మొదలుపెట్టింది. బావి యజమానితో పాటు గ్రామస్తులతో మాట్లాడి, శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తల నుంచి దివ్య భాస్కర్ టీం అభిప్రాయాలను కోరింది.

ఈ బావి జామ్‌నగర్-అమృత్‌సర్ జాతీయ రహదారి పక్కన ఉన్న విర్‌పర్దా గ్రామంలోని పొలంలో ఉంది. సుమారు మూడు నెలల క్రితం నిర్మించిన ఈ బావి 30 అడుగుల వ్యాసం, 18 అడుగుల లోతు కలిగి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన మిస్టరీగానే మిగిలిపోయింది.