క్లాస్ రూంలో అమానవీయ ఘటన..క్లాసుకు ఎందుకు లేట్ వచ్చావని టీచర్అడిగినందుకు..నన్నే ప్రశ్నిస్తావా అంటూ విద్యార్థి ఆగ్రహం.. నేను ఎప్పుడైనా వస్తాను.. ఎప్పుడైనా వెళ్తాను.. నాయిష్టం అంటూ నానా బూతులు.. అంతటితో ఆగక టీచర్‌పై అమానుష దాడి.. గుజరాత్ లోని వడోదర హైస్కూల్ లో టీచర్ ను ఓ విద్యార్థి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
షాకింగ్ ఇన్సిడెంట్..గుజరాత్ లోని వడోదర లో ఓ హైస్కూల్ లో టీచర్ ను ఓ విద్యార్థి చెంప దెబ్బకొట్టిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. షెహ్రా సిటీలో శ్రీమతి ఎస్ జే దేవ్ సర్వజనిక్ హై స్కూల్ లో జనవరి 24న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో క్లాస్‌రూంలో విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తనపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
క్లాసు రూంలో ఏం జరిగింది..
ప్రీ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతుండగా.. ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అయిన మహిళా టీచర్ ప్రశ్నించింది. ఆలస్యానికి కారణం అడిగినందుకు అందరూ చూస్తుండగానే ఆమె చెంప దెబ్బకొట్టాడు. దీంతో అక్కడున్న విద్యార్థులు, టీచర్ షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత టీచర్ ను గట్టిగా పక్కకు తోసేసి క్లాస్ రూం నుంచి వెళ్లిపోయాడు. గదిలో జరిగిన మొత్తం ఘటన సీసీటీవీ లో రికార్డయ్యింది.
పోలీసుల ఎఫ్ ఐఆర్ ప్రకారం.. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ను సంప్రదించి బాలుడి పేరెంట్స్ కి ఫోన్ చేసింది. మొదట బాలుడి తండ్రి ఘటనపై విచార వ్యక్తం చేసినా.. మరుసటి రోజు ఇరవై మందితో స్కూల్ కు వచ్చి బెదిరించారని టీచర్తెలిపింది. దీంతో 18ఏళ్ల విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
A woman schoolteacher was allegedly slapped by a student before the entire class when she asked him why he was late for an exam. 😡😡😡 pic.twitter.com/uLMYt3oRlq
— SriSathya (@sathyashrii) February 7, 2026
