Vithika Sheru: గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ భార్య.. ఎమోషనల్ పోస్ట్తో బేబీ ఫోటోలు షేర్

Vithika Sheru: గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ భార్య.. ఎమోషనల్ పోస్ట్తో బేబీ ఫోటోలు షేర్

టాలీవుడ్ బ్యూటీ కపుల్స్లో చాలా స్పెషల్ జంట వరుణ్ సందేశ్-వితిక (Varun Sandesh Vithika). 2016లో వచ్చిన "పడ్డానండి ప్రేమలో" మూవీతో లవ్లో పడ్డ ఈ జంట.. అదే సంవత్సరం పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లయి 9 ఏళ్ళు అవుతున్న వీరికి ఇంకా పిల్లలు లేరు.  వచ్చే ఏడాది కచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని ఇటీవలే వరుణ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 

ఈ క్రమంలోనే, వితిక సోషల్ మీడియాలో.. గుడ్ న్యూస్ అని బేబీని ఎత్తుకున్న ఫోటోలు పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లతో పాటుగా వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచారా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, వితికా చెల్లెలు కృతికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారనే ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుని మురిసిపోయింది వితికా. ముఖ్యంగా మేము (వరుణ్ సందేశ్-వితిక) పెదమ్మ, పెదనానాగా ప్రమోషన్ పొందామంటూ వితిక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘‘ మా పిల్లలు మా ఆనందాల మూటను మాకు అందించారు. ఇప్పుడు మేము పెదమ్మ, పెదనానా అయ్యాము. ఇప్పుడు మా హృదయాలు మరింత పెద్దవయ్యాయి. ఒక అందమైన మగబిడ్డ మా జీవితంలోకి అడుగుపెట్టాడు. తనతో పాటు అంతులేని ప్రేమ, వెలుగు మరియు ఆనందాన్ని తీసుకువచ్చాడు. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు నిజంగా సరిపోవు. మా కుటుంబానికి ఈ అమూల్యమైన ఆనందాల మూటను ప్రసాదించినందుకు ఈ విశ్వానికి చాలా కృతజ్ఞతలు’’ అనే క్యాప్షన్తో ఫోటోలు పంచుకుంది. 

ఈ శుభ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వితికతో పాటు ఆమె చెల్లెలికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చెల్లి అయినప్పటికీ కృతికను చంటిపాపలా చూసుకుంది వితిక. 2022లో కృతిక, కృష్ణల వివాహన్నీ దగ్గరుండి జరిపింది. ఇప్పుడు తన చిట్టి చెల్లికి బాబు పుట్టడంతో వితిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి

ఇకపోతే.. వరుణ్ సందేశ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. వితికా మాత్రం ఇండస్ట్రీకి దూరం అయి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ "నయనం" వెబ్ సీరీస్ జీ5ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.