SL vs PAK Match- Fixing: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాక్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. దీంతో లంక ముందు భారీ టార్గెట్ పెట్టింది. ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కూడా తెర మీదకి వచ్చాయి. ఓపెనర్ ఫఖార్ జమాన్ ఔట్ అయినప్పటికీ, ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ఇవ్వలేదు.. మరో వైపు క్లియర్ గా బ్యాట్ తగిలినప్పటికీ కూడా శ్రీలంక టీమ్ రివ్యూ తీసుకోకపోవడం.. ఫలితంగా ఫఖార్ జమాన్ ఏకంగా 84 రన్స్ చేసి బ్యాటింగ్ లో ఇరగదీశాడు. ఈ దెబ్బకు దాయాది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 212 రన్స్ చేసింది. దీంతో ఫఖార్ జమాన్ ఔట్ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనిపై ఐసీసీ దర్యాప్తు చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
166 స్ట్రైక్ రేట్ సాధించిన ఫర్హాన్, 100 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అటు మరో ఓపెనర్ ఫఖార్ జమాన్ (84) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. అతడు 20 పరుగుల లోపే అవుట్ కావాల్సి ఉండగా కీపర్ క్యాచ్ పట్టగా, ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అలాగే శ్రీలంక క్రికెటర్లు కూడా రివ్యూ తీసుకోలే.. తీరా ఆల్ట్రా ఎడ్జ్ లో మాత్రం బ్యాట్ ను బాల్ తగిలినట్లు క్లియర్ గా కనిపించింది. దీంతో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి.
ఫీల్డ్ అంపైర్లు, శ్రీలంక ఆటగాళ్లు, పాకిస్తాన్ జట్టుకు అమ్ముడుపోయారని సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ని సెమీ ఫైనల్ కు పంపించేందుకు శ్రీలంక టీమ్ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టి మ్యాచ్ లో పాకిస్తాన్ భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లో 148 పరుగులకే శ్రీలంకను దాయాది దేశం కట్టడి చేయాలి.. లేకపోతే పాకిస్తాన్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ 148 రన్స్ కంటే తక్కువ శ్రీలంక జట్టును కట్టడి చేయగలిగితే.. పాక్ సెమీస్ లోకి ఈజీగా ఎంట్రీ ఇస్తుంది.
Now let’s see how many articles & videos will @WisdenCricket & @TeleCricket make about Srilanka & Pakistan match fixing #T20WorldCup | #SLvsPAK
— Abhi (@abhi_izz_here) February 28, 2026
pic.twitter.com/XsnNgEfs5A
