టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయి దుర్గ తేజ్. గతేడాది 'విరూపాక్ష'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే ఆశ్చర్యపరిచేలా ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ విజువల్ వండర్ 'సంబరాల ఏటిగట్టు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఒక్క క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లు!
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్ర క్లైమాక్స్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 20 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఒక సినిమా క్లైమాక్స్‌కే ఇంతటి భారీ మొత్తం కేటాయించడం ఇండియన్ సినిమాలో అరుదుగా జరిగే విషయం అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది..
35 రోజుల పోరాటం.. 18 యాక్షన్ బ్లాక్స్!
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన, హై-ఓల్టేజ్ క్లైమాక్స్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ కెవిన్ నేతృత్వంలో ఏకంగా 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్‌లో మొత్తం 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉంటాయని సమాచారం. యుద్ధభూమి నేపథ్యంలో సాగే ఈ పోరాట ఘట్టాలు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా, అత్యంత ఎమోషనల్ గా, రా (Raw) గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
సాయి దుర్గ తేజ్ సరికొత్త మేకోవర్
ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ తన రూపం నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ మార్చేశారు. గతంలో విడుదలైన 'అసుర ఆగమన' గ్లింప్స్ లో ఆయన ఇంటెన్సిటీ చూస్తేనే అర్థమవుతోంది ఆయన ఈ పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తున్నారో. రిస్క్ తో కూడుకున్న ఎన్నో స్టంట్స్ ను ఆయన ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిజికల్ గా ఇది ఆయన కెరీర్ లోనే అత్యంత కష్టమైన పాత్ర అని చెప్పవచ్చు. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. భూమి, సంస్కృతి, పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొత్తానికి, 'సంబరాల ఏటిగట్టు' కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా, ఒక విజువల్ ట్రీట్ గా నిలవబోతోంది. సాయి దుర్గ తేజ్ తన కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి!
