హోలి పండుగ.. చంద్రగ్రహణం రెండూ ఒకే రోజు మార్చి 3 వ తేదీన వచ్చాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆరోజు కుంభరాశిలో బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం రెండు అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ యోగాల ప్రభావం 12 రాశులపై ఉన్నా.. నాలుగు రాశుల వారికి అదృష్టం కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు హోలి పండుగ ఏ రాశుల వారికి మంచి ఫలితాలు కలుగజేస్తుందో ... ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
తెలుగు ప్రజలు హోలీ సెలబ్రేషన్స్ కు రడీ అవుతున్నారు. ఆరోజు ( మార్చి 3)న కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఇంకా సూర్యుడు.. శుక్రుడు కలవడం శుక్రాధిత్య రాజయోగాలు ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయని పండితులు చెబుతున్నారు.
మేష రాశి : ఈ రాశి వారి హోలీ పండుగ రోజు ఏర్పడే రెండు అత్యంత శక్తివంతమైన యోగాల వలన .. పండుగ తరువాత రోజునుంచి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు అధికంగా లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి హోలీ పండుగ రోజునే ఏర్పడే రెండు శక్తివంతమైన యోగాల వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అనుకోని అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ వ్యవహారం చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | ఆధ్యాత్మికం : చంద్రగ్రహణ సమయంలో ఈపనులు అస్సలు చేయొద్దు.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!
తులారాశి: ఈ రాశి వారికి హోలీ పండుగ తరువాత ఆర్థికంగా కలిసి వస్తుంది. పూర్వీకుల ఆస్తి చేతికి అందుతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అప్పుల సమస్యలు పరిష్కారం కావడంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు అన్నీ విధాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ధనస్సు రాశి :ఈ రాశి వారికి హోలీ పండుగ లక్కు తీసుకొస్తుందని చెప్పాలి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కల నెరవేరుతుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి.వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో అమ్ముడుకాని వస్తువులకు గిరాకీ వస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. హోలీ పండుగ రోజున ఏర్పడే రెండు శక్తివంతమైన యోగాల ప్రభావం వలన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
