ఆధ్యాత్మికం : చంద్రగ్రహణ సమయంలో ఈపనులు అస్సలు చేయొద్దు.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!

ఆధ్యాత్మికం : చంద్రగ్రహణ సమయంలో ఈపనులు అస్సలు చేయొద్దు.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!

హిందూ మత విశ్వాసాల ప్రకారం చంద్ర గ్రహణం అశుభకరంగా పరిగణించబడుతుంది.  ఈ ఏడాది మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. . ఈ సమయంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు..  చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు.. అనుకోకుండా చేస్తే ఎలాంటి నష్టం కలుగుతుంది.  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .!

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది మార్చి  చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్ర గ్రహణం అంటారు. ఈ గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభం కానుంది. ఈ గ్రహణం మన దేశంలో చివరి 27 నిమిషాలు కనపడుతుంది. కాబట్టి మనకు సూతకాలం వర్తిస్తుంది

మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణ సమయ వివరాలు: 

  • గ్రహణ ప్రారంభం : మధ్యాహ్నం 3:21 గంటలు
  • గ్రహణ మధ్యకాలం: సాయంత్రం 5:03 గంటలు
  • సంపూర్ణ మధ్యకాలం: సాయంత్రం 5:32 గంటలు
  • గ్రహణ మోక్ష (విడుపు)కాలం: సాయంత్రం 6:48 గంటలు
  • గ్రహణం మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు
  • భారతదేశంలో  కనపడే సమయం: సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

చంద్ర గ్రహణం వేళ ఆహారం వండటం, జుట్టు, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటున చేయకండి. ఇలా చూడటం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం లేదా కుట్టుపని చేయడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. 

ALSO READ : చంద్రగ్రహణం అత్యంత శక్తివంతం... వ్యాపారస్తులు..

ఏ పని చేస్తే ఏమి జరుగుతుంది. 

  • గ్రహణకాలమున నిద్రిస్తే రోగము
  • మూత్రవిసర్జన వలన దారిద్య్రము
  • మలవిసర్జన వలన పురుగుగా జన్మించుట
  • మైథునం ( భార్యభర్తలు కలిస్తే) వలన గ్రామపందిగా జన్మించుట
  • అభ్యంగస్నానం వలన కుష్ఠు రోగము
  • భోజనం చేయుటవలన నరకము 
  • శుభకార్యాలు చేస్తే  మధ్యలోనే ఆ పని ఆగిపోతుంది
  • గ్రహణం సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి
  • గర్భిణి స్త్రీలు గ్రహణానికి రెండు గంటలు ముందుగానే భోజనం చేయాలి. గ్రహణం సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలా చేయకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం కలుగుతుంది.  
  •  స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదు.. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

గ్రహణ కాలంలో ఈ పనులు తప్పనిసరిగా నివారించండి, కొత్త ఒప్పందాలు సంతకం చేయడం, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకోవడం లేదా ఇవ్వడం, ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడం మొదలగు పనులకు కూడా దూరంగా ఉండాలి. ఇదంతా మూఢ నమ్మకాలు.. ఏమీ జరగదని చేస్తే ఆస్తి వ్యవహారాల్లో తప్పకుండా గొడవలు వస్తాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.