జ్యోతిష్యం: చంద్రగ్రహణం అత్యంత శక్తివంతం... వ్యాపారస్తులు.. ఉద్యోగస్తులు చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం: చంద్రగ్రహణం అత్యంత శక్తివంతం... వ్యాపారస్తులు.. ఉద్యోగస్తులు చేయాల్సిన పరిహారాలు ఇవే..!

గ్రహణ కాలం సాధారణ జపానికి వేల రెట్లు ఫలితం ఉంటుంది.  వ్యాపారంలో నష్టాలు, అమ్మకాలు ఆగిపోవడం, కోర్టు చిక్కులు, వీటన్నింటికీ ఈ గ్రహణ కాలం శక్తివంతమైన పరిష్కార సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే..రియల్​ ఎస్టేట్​  వ్యాపారులు..చంద్రగ్రహణం  సమయంలో కొన్ని  శక్తివంతమైన పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  ఎవరు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

చంద్రగ్రహణం మహిమ......చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు అది మన మనస్సు, భావాలు మరియు భూమికి సంబంధించిన శక్తుల పునర్వ్యవస్థీకరణ కాలం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.......చంద్రుడు.... మనస్సు, నగదు ప్రవాహం, మానసిక స్థైర్యం ఇస్తాడు.కుజుడు...... భూమి, రియల్ ఎస్టేట్, శక్తి అని పండితులు చెబుతున్నారు. 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ( 2026) తొలి చంద్రగ్రహణం.. తెలుగు సంవత్సరాల్లో విశ్వావశునామ సంవత్సరంలో చివరి గ్రహణం మార్చి 3 వతేదీన ఏర్పడుతుంది. 

  • గ్రహణ ప్రారంభం : మధ్యాహ్నం 3:21 గంటలు
  • గ్రహణ మధ్యకాలం: సాయంత్రం 5:03 గంటలు
  • సంపూర్ణ మధ్యకాలం: సాయంత్రం 5:32 గంటలు
  • గ్రహణ మోక్ష (విడుపు)కాలం: సాయంత్రం 6:48 గంటలు
  • గ్రహణం మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు
  • భారతదేశంలో  కనపడే సమయం: సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

గ్రహణ సమయంలో చేయవలసిన జపాలు......

గ్రహణ కాలంలో చేసే జపం వేల రెట్లు ఫలితమిస్తుంది, ఒక్క క్షణం కూడా వదులుకో వద్దని  పండితులు చెబుతున్నారు. 

వ్యాపారస్తులు: జ్యోతిష్యం ప్రకారం రియల్ ఎస్టేట్  వ్యాపారం  కుజుడికి సంబంధించింది. ఈ వ్యాపారం చేసినా.. ఎలాంటి వ్యాపాస్తులైనా  ఋణవిమోచన అంగారక స్తోత్రం.....  పాత అప్పులు తీరుతాయి.  ఇక రియల్​ ఎస్టేట్​ వ్యాపారులకు భూమి అమ్మకాలు సాఫీగా జరిగి.. అధికంగా లాభాలు వస్తాయని పండితులు అంచనా వేస్తున్నారు. 

చంద్ర కవచం / చంద్ర స్తోత్రాన్ని గ్రహణ సమయంలో పఠించడం వలన  వ్యాపార నిర్ణయాల్లో తడబాటు తొలగించి Mental Clarity తీసుకువస్తుంది. వ్యాపారస్తులు తప్పనిసరిగా...ఓం సోమాయ నమః.. అనే మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధగా జపం చేయాలి.  తరువాత బ్రాహ్మణులకు స్వయంపాకం.. దక్షిణ తాంబూలం ఇవ్వాలి. 

లక్ష్మీ దేవి జపం:  ఆర్థిక ఇబ్బందులు తొలగించి కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడానికి మహాలక్ష్మి అనుగ్రహం కోసం పఠించండి. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

మహామృత్యుంజయ మంత్రం: ఆరోగ్య సమపస్యలు.. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోయేందుకు చంద్రగ్రహణ సమయంలో ....ఓం, త్య్రంబకం, యజామహే, సుగంధిం, పుష్టివర్థనం, ఉర్వారుకం, మృతోర్ముక్షీయ, అమృతాత్ ..ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, అన్ని అడ్డంకులు తొలగిపోయి వ్యాపారంలో నూతన శక్తి వస్తుంది.

శివారాధన అత్యంత శక్తివంతమైన పరిహారం:  గ్రహణ కాలంలో శివుని ఆరాధన సర్వోత్కృష్టమైనది,"ఓం నమః శివాయ" జపం నిరంతరంగా చేయండి. శివాలయంలో పాలు , గంగాజలంతో అభిషేకం చేయించుకోవడం అత్యుత్తమం. ఇది చంద్ర దోషాన్ని శాంతింపజేసి వ్యాపారంలో ప్రశాంతత తీసుకువస్తుంది.

భూమికి సంబంధించిన ప్రత్యేక పరిహారం:  భూమి సంబంధిత విషయాల్లో ఇబ్బందులు పడుతుంటే ..  ఆ భూమి మట్టిని కొంచెం తీసుకొని తెల్లటి వస్త్రంలో మూటగట్టి మీ పూజా గదిలో ఉంచండి. గ్రహణం ముగిసిన వెంటనే ఆ మట్టి మూటను ప్రవహించే నదిలో లేదా కాలువలో కలిపేయండి, ఆ భూమిపై పేరుకుపోయిన ప్రతికూల శక్తి తొలగిపోయి  మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.భూమి దేవతకు నమస్కారం చేసి, మీ వ్యాపారం వృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ప్రార్థించండి.

గ్రహణం తర్వాత చేయవలసిన దానాలు ..

గ్రహణం వీడిన వెంటనే స్నానం చేసి ఈ దానాలు చేయండి.

చంద్ర దోష నివారణకు : చక్కెర, తెల్ల బట్టలు పేదవారికి లేదా బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానంచేయండి.

భూమి సంబంధిత చిక్కుల నివారణకు: ఒక కిలో బియ్యంతో చిన్న వెండి ముక్కను తెల్లటి వస్త్రంలో ఉంచి దానం చేయండి. కందులు దానం చేయడం వల్ల కుజుడు ప్రసన్నుడై భూమి అమ్మకాల్లో అడ్డంకులు తొలగుతాయి.

ఉద్యోగులు ఇబ్బందుల పరిష్కారానికి :  గ్రహణం తర్వాత మరుసటి రోజు మీ ఆఫీసును శుభ్రం చేసి గోమూత్రం లేదా ఉప్పు కలిపిన నీటితో గదులు తుడవండి. ఆఫీసు ఈశాన్య మూలలో గాజు గ్లాసులో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉంచండి ఇది ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది.  ఇంటిలో ... ఆఫీస్‌లో గ్రహణం తరువాత  వాస్తు  పూజ చేయించుకోవడం కూడా మంచిది.

ఇది సామాన్య ఉద్యోగులకు సాధ్యపడదు. అందువలన వారి పని ప్రదేశంలో  గంగా జలాన్ని కాని.. ఉప్పు వేసిన నీటిని కాని చల్లండి.. కంప్యూటర్​ లాంటి వస్తువులపై ఆ నీటిని సంప్రోక్షణ చేయండి.  ఇలా చేయడం వలన ఉద్యోగస్తుల కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 

గజేంద్ర మోక్షం పారాయణం : చాలాకాలంగా నిలిచిపోయిన భూమి అమ్మకాలు, కోర్టు చిక్కులు వల్ల నష్టపోతుంటే గ్రహణ సమయంలో లేదా వెంటనే గజేంద్ర మోక్షం" పారాయణం చేయండి. గజేంద్రుడికి ఉన్న అడ్డంకులు తొలగినట్లే, మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగి విజయం లభిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.