జార్ఖండ్ లో విద్యార్థులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయి. విద్యార్థుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో మళ్లీ నిరసన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు విద్యా్ర్థులు. ఆగస్టు 10న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) లో అవకతవకలు జరిగాయని.. పరీక్షలను వాయిదా వేసి సీబీఐ విచారణ జరపాలని గత కొంతకాలంగా అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆగస్టు 9న ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. JPSC పరీక్ష వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. అదే విధంగా జడ్జితో విచారణ జరిపేందుకు అంగీకరించింది. అయితే సీజీఎల్ (CGL) పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ నిరసన బాట పట్టారు. అదే విధంగా సీబీఐ విచారణ జరపాల్సిందేనని పట్టుబట్టారు.
మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను.. 98 శాతం డిమాండ్లకు సీఎం హేమంత్ సోరేన్ ప్రభుత్వం అంగీకరించింది. 14వ JPSC పరీక్షల్లో అవినీతికి పాల్పడిన వారిపై సీఐడి, ఈడీ విచారణ జరిపేందుకు సిద్ధమని తెలిపారు.
►ALSO READ | ఆ మూడు దేశాలకే సాధ్యమైన టెక్నాలజీ.. ఇప్పుడు ఇండియాకు సొంతం.. FFSC రాకెట్ ఇంజిన్ ప్రాముఖ్యత ఏంటి..?
అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లు సీజీఎల్ పరీక్షను రద్దు చేయడం కుదరదని మంత్రి అన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలతో పరీక్ష నిర్వహించామని.. జుడీషియల్ మానిటరింగ్ లో ఉన్నందున రద్దు చేయడం కుదరని చెప్పారు. ఇప్పటికే రిజల్ట్స్ ప్రకటించి.. అభ్యర్థులు ఉద్యోగాల్లో జాయిన్ అయినందున కుదరని చెప్పారు.
దీనికి బదులుగా రిటైర్డ్ జడ్జీతో కమిటీ వేసి.. విచారణ చేసేందుకు సిద్ధమని తెలిపారు. దీనికి విద్యార్థులు ఒప్పుకోలేదు. సీబీఐ విచారణతో పాటు సీజీఎల్ పరీక్ష రద్దుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సీజీఎల్ రద్దు కుదరని ప్రభుత్వం చెప్పడంతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
