మారేడుమిల్లిలో ఘోరం.. పాపం ఈ ఐదేళ్ల పిల్లాడు.. అమ్మానాన్నను కోల్పోయి..

మారేడుమిల్లిలో ఘోరం.. పాపం ఈ ఐదేళ్ల పిల్లాడు.. అమ్మానాన్నను కోల్పోయి..

మారేడుమిల్లి: పోలవరం జిల్లా మారేడుమిల్లిలో ఘోరం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న కొడుకును చూసి బైక్పై మరో కొడుకుతో కలిసి తిరిగి ఇంటికి వెళుతుండగా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. బైక్పై ఉన్న వీరి చిన్న కొడుకైన ఐదేళ్ల పిల్లాడు సందీప్ గాయాలతో బయటపడ్డాడు. వీళ్ల సొంతూరు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురం గ్రామం. చనిపోయిన భార్యాభర్తలను కొల్లేటి శ్రీను, కొల్లేటి శోభారాణిగా పోలీసులు గుర్తించారు.

భద్రాచలంలో ఆశ్రమ పాఠశాలలో వీళ్ల పెద్ద కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో ఉన్న పెద్ద కొడుకును చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలు కన్న తల్లిదండ్రులను కోల్పోయి కన్న ప్రేమకు దూరమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

►ALSO READ | రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి... మృత్యువుతో ఐదు రోజులు పోరాడి..