ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 59 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. జీవో సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోగా ప్రారంభించాలని ఆదేశించింది. బీసీల జనగణన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ ను కూడా కొట్టివేసింది.
