ఫామ్ 6 లో మార్పులపై కీలక ప్రశ్నలు సంధించారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఓటర్ రిజిస్ట్రేషన్ లో కీలకమైన ఫామ్ 6లో మార్పులు చేయమని ఎవరు ఆదేశించారని ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. ఈ మార్పులను అమలు చేయమని టాటా కన్సల్టెన్సీని (TCS) ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.
ఫామ్ 6లో మార్పులపై 2026 అక్టోబర్ 01వ తేదీన ఎక్స్ లో ట్వీట్ చేశారు రాహుల్. ఆన్ లైన్ ఫామ్ 6 చట్ట విరుద్ధంగా మార్చారు.. ఎన్నికల సంఘంలో ఉన్న కమిషనర్లే ఈ నిర్ణయం తీసుకున్నారా..? మార్పులు చేయాల్సిందిగా టాటా కన్సల్టెన్సీని ఒత్తిడి చేసిందెవరు. దీనిపై సంతకాలు చేసింది ఎవరు..? అని ప్రశ్నించారు.
విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ డిక్లరేషన్ ను ECINET యాప్, పోర్టల్ నుంచి, అలాగే ప్రధాన ఎన్నికల అధికారి పోర్టల్‌ల నుండి తొలగించారు. దీని అర్థం, ఈ రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు కేవలం ఓటరు నమోదు కోసం సాధారణ చట్టబద్ధమైన ఫారం 6ను మాత్రమే సమర్పిస్తే సరిపోదతుందని చెబుతున్నారు.
SIR ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో, అదనపు డిక్లరేషన్ ECINET పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ డిక్లరేషన్ ప్రకారం, కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులను లేదా తాతామామ్మలను, గతంలో జరిగిన SIR సమయంలో తయారుచేసిన ఓటర్ల జాబితాల అటాచ్ చేస్తూ వివరాలను అందించాల్సి ఉంటుంది.
The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded. Who at the ECI ordered Tata Consultancy Services to make that change? Who at TCS signed off on it? And were they pressured into doing it?
— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026
