ఇటీవల రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళా డాక్టర్ ప్రియాంక మృతి చెందారు.సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు డాక్టర్లు. ఆదివారం ( ఆగస్టు 9 ) ప్రియాంక ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రకటించిన డాక్టర్లు కాసేపటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు.
ఆగస్టు 3న రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ లో పార్కింగ్ విషయంలో గొడవ కారణంగా ప్రియాంకను కారుతో అమానుషంగా ఢికొట్టారు నిందితులు. ఈ ప్రమాదంలో కారు ప్రియాంక తలపై ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | భర్తను చంపేసి.. సిలిండర్ పేలిన ఘటనగా చిత్రీకరించిన భార్య.. నిర్మల్ జిల్లా హత్య కేసును ఛేదించిన పోలీసులు
మెరుగైన చికిత్స కోసం ప్రియాంకను హైదరాబాద్ కు తరలించారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజమండ్రికి చెందిన దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా వారికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
