- రూ.11,600 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం
సిద్దిపేట రూరల్, వెలుగు: పేకాట ఆడుతూ మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ పోలీసులకు పట్టుబడ్డాడు. సిద్దిపేట టూ టౌన్ సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మహాశక్తి నగర్ లోని మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
రఘోత్తంరెడ్డితో పాటు వివేకానంద కాలనీకి చెందిన గోవిందపురం కనకయ్య, హనుమాన్ నగర్ కు చెందిన సిద్దంకి రమేశ్, రామునిపట్ల గ్రామానికి చెందిన పంతం వెంకట్ ను అదుపులోకి తీసుకున్నారు.
రంగదాంపల్లికి చెందిన గంగసాని భాస్కర్ రెడ్డి, హనుమాన్ నగర్ కు చెందిన గంగుల బాలు, గోనెపల్లికి చెందిన మధుసూధన్ పరారయ్యారు. వారి వద్ద రూ.11,600 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
