సీఎం సిరిసిల్లకొస్తే ఎందుకంత భయం?..కేటీఆర్ పిచ్చిమాటలు బంద్ చెయ్యి : మెట్టు సాయి కుమార్

సీఎం సిరిసిల్లకొస్తే ఎందుకంత భయం?..కేటీఆర్ పిచ్చిమాటలు బంద్ చెయ్యి : మెట్టు సాయి కుమార్
  • ఫిషరీస్ కార్పొరేషన్​ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై గతి, మతి లేని మాటలు బంద్ చెయ్యాలని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్​ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కోరారు. ఈ నెల 30వ తేదీన సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ అంటేనే కేటీఆర్ నిలువునా వణికిపోతుండని తెలిపారు. ఆయన నియోజకవర్గానికి రేవంత్​ వస్తే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో మెట్టు సాయి కుమార్  మాట్లాడారు.

సిరిసిల్ల నియోజకవర్గానికి సీఎం వస్తే స్థానిక ఎమ్మెల్యేగా సాదరంగా ఆహ్వానించి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించాల్సిన కేటీఆర్...అసహనంతో రేవంత్‌పై నోరుపారేసుకోవడం సరైంది కాదని హితవు పలికారు.  ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సీఎంను అభివృద్ధి కోసం నిధులు అడిగితే హూందాగా ఉంటుందని సూచించారు.