Manasa Varanasi: ‘కపుల్ ఫ్రెండ్లీ’ హీరోయిన్‌‌కు మరో బంపర్ ఆఫర్.. శర్వానంద్‌‌తో రొమాన్స్

Manasa Varanasi: ‘కపుల్ ఫ్రెండ్లీ’ హీరోయిన్‌‌కు మరో బంపర్ ఆఫర్.. శర్వానంద్‌‌తో రొమాన్స్

‘కపుల్‌‌ ఫ్రెండ్లీ’ చిత్రంతో హీరోయిన్‌‌గా చక్కని గుర్తింపును అందుకున్న మానస వారణాసి.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో అవకాశం అందుకుంది.  శర్వానంద్‌‌కు జంటగా ఆమె నటించబోతోంది. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. శర్వానంద్‌‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘జార్జ్‌‌ క్రిష్​’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇందులో మానస వారణాసిని హీరోయిన్‌‌గా ఫైనల్ చేశారు.  కథలో కీలకంగా ఉండే పాత్రను ఆమె పోషించబోతోందని,  గురువారం తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ బూస్టర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర కో ప్రొడ్యూసర్. అనూప్ రూబెన్స్‌‌ సంగీతం అందిస్తున్నాడు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌‌. నందు సవిరిగాన, గోపీ మోహన్ రైటర్స్‌‌గా వర్క్ చేస్తున్నారు.  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.