సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆమె జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండవ విడతలో మంజూరైన లబ్ధిదారుల వివరాల గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ దస్త్రాలను కలెక్టరేట్‌కు పంపాలని, అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం నిర్మాణ దశలకు అనుగుణంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
